సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, మార్చి 2012, గురువారం

తెలుగుబ్లాగుల తోటలో.....బ్లాగరు పూమొల్క లార !


పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన

రచయితలు క్రొత్తవారు   తారస పడంగ

జూచితిమి గాని నేడహో !   చూడచక్క

నైన   రచయిత లెందరో గాన నయ్యె



తెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి

వ్రాయు  బ్లాగరు పూమొల్క లార !  మీ ర

చనల సౌగంధి కాలతో తెనుగు దోట

నేడదిగొ !  గుభాళించి పన్నీరు చిలికె 



ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,

కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి

వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,

బ్లాగు భారతి తెలుగున పరవశించె



ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు

తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి

యొకట స్పందించు భావుకత గలదు

రచయితల కుండ దగ్గ వీ లక్షణములె



ఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి

కోరి గొంతెత్తి పాడు చున్నారు ,  చేరి

అందరికి శుభాకాంక్ష లంద జేతు

నందనోగాది   కానంద మంద గోరి  






20 కామెంట్‌లు:

  1. అరె వహ్ ఎంత బాగున్నాయో మీ పద్యాలు! బ్లాగులు, బ్లాగర్ల గురించి భలే చెప్పారు!

    రిప్లయితొలగించండి
  2. బ్లాగు జనులన్ బహు బాగుగా మెచ్చితిర్
    మది న మెండుగాన్ సంతసంబు ... ధన్యవాదములు.

    ఆడదరాభివృద్ది నందిన కర్మలో
    ఆత్మ శక్తి తానే యదికమగును
    మానవత్వ మచట మహితమైన యొప్పారు
    తెలిసి మెలగుమోయి తెలుగు తనయ ..
    అన్నారు కదండీ..

    రిప్లయితొలగించండి
  3. బ్లాగు జనులన్ బహు బాగుగా మెచ్చితిర్
    మది న మెండుగాన్ సంతసంబు ... ధన్యవాదములు.

    ఆదరాభివృద్ది నందిన కర్మలో
    ఆత్మ శక్తి తానే యదికమగును
    మానవత్వ మచట మహితమైన యొప్పారు
    తెలిసి మెలగుమోయి తెలుగు తనయ ..
    అన్నారు కదండీ.. ..

    రిప్లయితొలగించండి
  4. మీకు ఉగాది శుభాకంక్షలు మాష్టారు.
    ఈ పోస్ట్ లో పదాలు అన్ని నాకు అర్ధం అయ్యాయి.
    అడిగిన పిదపే నా సందేహాలు నివ్రుత్తి చేస్తున్నందుకు వందనాలు,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. తెలుగు బ్లాగర్లను ఇంత పాజిటివ్ గా ప్రోత్సాహించేవారుండడం ఆనందించదగ్గ విషయం.తెలుగు బ్లాగులలో బ్లాగరు పూమొల్కలకు మాస్టారి మాటలు మంచి ప్రేరణనిస్తాయి. ఇపుడే మాస్టారి బ్లాగు చూశాను. జనవిజయం నచ్చిన బ్లాగుల లిస్టులో ఈ బ్లాగ్ చేర్చాను. మాస్టారూ మీ పద్యాలు బాగుంటున్నాయి. మీకు ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. రసఙ్ఞ ,వనజ వనమాలి ,జలతారు వెన్నెల ,పల్లా కొండల రావు - గార్ల కు సుజన-సృజన సుస్వాగతం . తమ సహృదయతకు ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  7. ఎంత బాగా చెప్పారండీ..ఉగాది శుభాకాంక్షలండీ:)

    రిప్లయితొలగించండి
  8. మీ బ్లాగు పసుపు శోభతో కవితా పరిమళాలు వెదజల్లుతుంది .మీ అనుభవాల పొదరిల్లు లో పుట్టిన పారిజాతం మీ బ్లాగు .ఎంత స్నేహ సౌరభం బ్లాగు మిత్రుల మధ్య .మళ్ళీ ఉత్తరాలు వ్రాసుకున్న పాత రోజులు గురుతొస్తున్నాయి

    రిప్లయితొలగించండి
  9. సుభ గారూ ,ధన్యవాదములు .
    రవిశేఖర్ గారూ , ధన్యవాదములు .తమ స్నేహశీలతకు ,సహృదయతకు కృతఙ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  10. చాలా బావుంది మాస్టారు. ఉగాది రోజున బ్లాగ్వనంలో విరిసిన చక్కటి పద్య కుసుమాలు. భాస్వికలు అంటే ఏంటండి?

    రిప్లయితొలగించండి
  11. నారాయణస్వామి గారూ , సంతోషం . ధన్యవాదాలు . భాస్వికలు అంటే దివ్వెలు .

    రిప్లయితొలగించండి
  12. రాజారావు గారూ మీ బ్లాగు పూతోటలో విరిసిన పద్యపుష్పాలు ఈ నాడు తెలుగు తల్లికే అలంకారాలు. మీకూ మీ కుటుంబసభ్యులకూ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  13. బ్లాగర్లను పూలమొక్కలతో పోలుస్తూ మన బ్లాగర్ల ప్రత్యేకతలను చక్కగా చెప్పారండీ..
    మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  14. జ్యోతర్మయి గారూ , మీ సహృదయతకు కృతఙ్ఞతలు .
    రాజి గారూ , ధన్యవాదాలు .

    ఈ పోష్టుకు స్పందించిన అందరితో పాటు యావన్మంది బ్లాగరులకు , పాఠకులకు , మిత్రులకు పేరు పేరునాఉగాది శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  15. చాలా సంతోషం మాస్టారు గారూ, ఇలా సహృదయతతో ప్రియభాషణములు పద్యాలుగా కూర్చి పండుగనాడు పరవాణ్ణం లా అందించారు. ధన్యవాదాలు. మీరన్నట్లే కవిసమ్మేళనాలకి, ఇష్టాగోష్ఠికి తగు వాతావరణం ఉందిక్కడ. మునుపట్లో మహేష్ గారు బ్లాగు రచనలపై చక్కటి అంశం లేవనెత్తారు, అక్కడ అభిప్రాయాలూ బావున్నాయి, వీలైతే చూడండి - http://parnashaala.blogspot.com/2009/04/blog-post_5541.html

    జయహో బ్లాగ్వ్యాఖ్యాస్వాతంత్రం జయహో బ్లాగ్సాహీతీమిత్రత్వం...

    రిప్లయితొలగించండి
  16. ఉష గారూ , ధన్యవాదములు . సుజన-సృజన మీకు స్వాగతం పలుకు తోంది . మీరందించిన మహేష్ గారి వ్యాసం చదివేను . తెలుగు బ్లాగరులు చక్కటి తెలుగు సాహిత్యాన్ని సృష్ఠిస్తున్నారు . మంచి పరిణామము . మనస్ఫూర్తిగా మరోమారు నేను తెలుగు బ్లాగర్లను అభినందిస్తున్నాను .

    రిప్లయితొలగించండి
  17. నేటి తెలుగువారికి ఇది ఖచ్చితంగా కావలిసిన ప్రోత్సాహం... మాష్టారు మీ మాటలలో పద్యాలలో చక్కగా వర్ణించారు.🙏👌

    రిప్లయితొలగించండి
  18. చైతన్యగారూ ,
    ధన్యవాదాలు . అప్పట్లో బ్లాగువాతావరణం
    సుహృద్భావస్థితిలో చక్కగా ఉండేది .
    ఆబ్లాగర్లందరూ కనుమరుగయ్యారు .
    ఇప్పుడు తిట్టుకోడాలూ , కొట్టుకోడాలూను .

    రిప్లయితొలగించండి
  19. తెలుగు బ్లాగుల తోటలో మొలిచి, నిలిచి
    వ్రాయు బ్లాగరు పూమొల్కలార
    --ఎంతటి ఆప్యాయత దాగున్నదీ పలుకులలో !
    ప్రస్తుతం బ్లాగు లోకంలో నేనో చిన్ని మొలకనే. మీలాంటి వారి మాటలు ఎంతో నూతనోత్తేజాన్ని, ప్రేరణను ఇస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నమస్తే 👃

    రిప్లయితొలగించండి