స్వార్థమే రూపు దాల్చిన జనుల వల్ల
జాతి నిర్వీర్య మయ్యె - హింస , యవినీతి ,
దోపిడీ , మోస మేదియు పాప మనక
డబ్బు కోసమే ‘
బ్రతుకు ‘ బడాయి యయ్యె
ఇట్టి దయనీయ స్థితిని దాటించు దారి
మనకు చదువొక్కటే – కాని , మంచి లేని
స్వార్థమును నేర్పు ‘ నేటి యీ ‘ చదువు కాదు
‘ విలువ ‘ లను నేర్పు చదువులు వెలయ వలయు
స్కూలు వ్యాపార సంస్థయై సోలు చుండ
సత్ప్రవర్తన నేర్పని చదువు లుండ
విలువ లెరుగని టీచర్లు విధుల నుండ
భావి పౌరుల బ్రతుకులు బాగు పడున ?
సత్య ధర్మాది యున్నత సద్గుణముల
విలువలను నేర్పు పాఠ్యాంశముల చదువులు ,
ధర్మ నిష్ఠత గల్గు విద్యాలయములు ,
మంచి టీచర్లు గల్గిన మార్పు వచ్చు
చదువు పూర్తయి విద్యార్థి - సత్య ధర్మ
వర్తనా మూర్తి మత్వ సంవాసియై , త
నంత విధులలో సౌశీల్యవంతుడై , స
మాజ హితుడై సతత సమ్మాన్యు డగును
చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును
చదువు సాంఘిక న్యాయాన్ని చక్కజేయు
చదువె సమ సమాజ సంస్థాప శక్తి
చదువె సంస్కరణ దిశా విజయ పథమ్ము
మాస్టారు బాగుందండి . చదువు వల్ల మార్పు సాధ్యమంటారా?
రిప్లయితొలగించండిజలతారు వెన్నెల గారూ ,
రిప్లయితొలగించండివిద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దుటకు అవసరమైన పాఠ్యాంశాలూ ,పాఠశాలలూ , టీచర్లూ ఏర్పడి నప్పుడు చదువు వల్ల సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు . ధన్యవాదాలు .
hii.. Nice Post Great job. Thanks for sharing.
రిప్లయితొలగించండిBest Regarding.
More Entertainment