నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !
రుచి చూసాము మాష్టారు. మీ పద్యరూపంలో.ఎంత బాగుందో!
రిప్లయితొలగించండిధన్యవాదాలు మాష్టారు
పద్యాలు బాగున్నాయి.
రిప్లయితొలగించండి’విబుధ విందులు’ మాత్రం మిశ్రమ సమాసం. బాగా లేదు. మార్చండి.
జలతారు వెన్నెల గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .
డా.ఆచార్య ఫణీంద్ర గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు . సూచనకు కృతఙ్ఞతలు .
Sir, తెలుగు పద్యమెంత తేనియరా... రుచి చూడరా అంటే బాగుండేదేమో కదా ఆలోచించండి , పద్యం చాలా గొప్పగా ఉంది
రిప్లయితొలగించండిSir, తెలుగు పద్యమెంత తేనియరా... రుచి చూడరా అంటే బాగుండేదేమో కదా ఆలోచించండి , పద్యం చాలా గొప్పగా ఉంది
రిప్లయితొలగించండిశ్రీ మిరాజ్ ఫాతిమా గారు ! ప్రియము తోడ
రిప్లయితొలగించండితెలుగు పద్యంపు తేనియ తియ్యదనము
మీరు రుచి చూచి చెప్పిరి మేలు మేలు !
ధన్యవాదములమ్మ ! సంతసము గల్గె .
----- సుజన-సృజన
తేనెకన్న, పనస తొనలకన్న,
రిప్లయితొలగించండిమీగడ పాలకన్న, తీయనైనది...
మన తెలుగు భాష...
మనకే సొంతమైన పద్యం....
చాలా బాగా చెప్పారు
రాజారావు గారూ!
మీకు అభినందనలు...
@శ్రీ
తేనె కన్న తియ్యనైన తెలుగు పద్యాన్ని మన బ్లాగరుల మధ్య ఉంచాలనే ఉద్దేశ్యం తోనే కామెంట్లను పద్యాలలో వ్రాస్తున్నాను . మీ అభినందనలకు ధన్యవాదాలు శ్రీ గారూ !
రిప్లయితొలగించండి