సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జూన్ 2012, మంగళవారం

సింహావలోకనం ..... వెంకట రాజారావు . లక్కాకుల


    ఈ సుదీర్ఘ జీవన యాన కాల గమనంలో 61 వసంతాలు పూర్తయినవి . ఈ రోజే అరవై రెండో పడి లోకి అడుగిడడం . అందుకే వెనక్కు తిరిగి సింహావలోకనం చేసు కోవడం .

     శైశవంలో , బాల్యంలో , యవ్వనంలో , నడి వయస్సులో ..... ఏర్పడిన సమస్యలూ – వాటిని అధిగమించడంలో జీవితం నేర్పిన పాఠాలూ – అనుభవాల తో జీవితం పండి పోయింది .  

      కుటుంబ జీవనం , లోటు పాట్లూ , భార్యా-బిడ్డలూ , వాళ్ళ బాధ్యతలూ – వ్యక్తిగత బాధ్యతగా తప్పని సరి .

      ఇక పోతే , ఆర్థిక యిబ్బందులకు తల యొగ్గి ఎంపిక చేసుకొన్నప్పటికీ , ఉపాధ్యాయ వృత్తి ద్వారా – లభించిన సామాజిక సేవా మార్గం లో - నేను పొందిన ఆనందం అనిర్వచనీయం .

       తొలి నుండీ చివరిదాకా – నాకు తోడు నిలిచి , నన్ను నడిపించిన – నాలోని నిబధ్ధత , సామాజిక దృక్పథం – వృత్తిలో సాధ్యమైనంతవరకు నన్ను సఫలీకృతుణ్ణి చేసినవి .

       గ్రామీణ నేపథ్యంలో సాగిన వృత్తి నిర్వహణ వల్ల – కేవలం పాఠశాల నిర్వహణ , బోధనలకే పరిమితం కాలేదు .

       ఒక నిర్దిష్ఠ కార్యక్రమాన్ని రూపొందించుకొని –

       పాఠశాల ముగిసిన తర్వాత మా ఉపాథ్యాయ సిబ్బందిని తోడు తీసుకొని , రోజుకొక ఆవాస ప్రాంతాన్ని సందర్శించడం , విద్యార్థుల – తల్లిదండ్రుల స్థితి గతులను విచారించడం చేసేవాడిని .

        తద్వారా విద్యార్థి పరిస్థితులు నాకే కాకుండా , మా ఉపాధ్యాయులకు కూడా అవగతమయ్యేవి . విద్యార్థి గైర్హాజరీకి గానీ , అధ్యయనంలో వెనక బాటు తనానికి గానీ  అసలు కారణం తెలిసి పొయ్యేది .

        విద్యార్థికి అవసరమైన సహాయ సహకారాన్నందించి  , సాధ్యమైనంత వరకు అసలు సమస్యను పరిష్కరించ గలిగే వాళ్ళము .

        గ్రామీణ విద్యా వ్యవస్థలో మరొక దురన్యాయం ఉంది . తల్లి దండ్రుల ఆదాయ వనరులు తక్కువ .

        కొడుకూ , కూతురూ – ఇద్దరూ స్థానిక ప్రభుత్వ విద్యాలయాలలో – 10 లేదా ఇంటర్ వరకూ విద్య పూర్తి చేస్తారు .

        పై చదువులకు కేవలం మగ పిల్ల వాడినే కొనసాగిస్తారు . అధ్యయనంలో ఎంత బాగా ముందున్నా – ఆడపిల్ల చదువు – కొనసాగించరు . ఆర్థిక ఇబ్బందులే బలమైన కారణ మైనప్పటికీ , సామాజిక కారణాలు కూడా లేక పోలేదు .

        ఈ అంశం నన్ను ఎక్కువగా బాధించేది . వాళ్ళ యిళ్ళకు వెళ్ళి సాధ్యమైనంతవరకు నచ్చచెప్పడం , పరిష్కారాన్ని సూచించడం , మార్గదర్శనం చేయడం , సహాయ సహకారాలందించడం చేసేవాడిని .

         ఈ విషయంలో ప్రభుత్వాలు అందించే తోడ్పాటు చాలడం లేదు . అందులో చిత్తశుధ్ధి కొరవడుతోంది .

         చదువులో ముందుండే గ్రామీణ విద్యార్థుల విషయంలో – అందునా ఆడ పిల్లల విద్య విషయంలో – ఇప్పుడు కూడా – సహాయ సహకారాలందిస్తూ , సరయిన మార్గ దర్శనం చేస్తూ – అందులో ఉండే ఆత్మ సంతృప్తిని అనుభ విస్తూ ఉండడం – ఆనందంగా ఉంది .   

20 వ్యాఖ్యలు:

  1. జన్మదిన శుభాకాంక్షలు సార్..!!
    మీరు ఇలాగే చదువు కోసం తొడ్పడే మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తి గా కోరుకుంతున్నాను....!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. దీర్ఘాయుష్మాన్ భవ.ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. జన్మదిన శుభాకాంక్షలు మాష్టారూ..ఉద్యోగాన్ని చట్రంలో బిగించక మానవతా ధర్మాన్ని జతకలిపి నిర్వర్తించారు. మీలాంటి ఉపాద్యాయులు ఈ దేశానికే గర్వకారణం. మిమ్మల్ని ఆ భావంతుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జ్యోతిర్మయి గారూ ,
      తమ ప్రశంశా పూర్వక ఆకాంక్ష లకు సర్వదా కృతఙ్ఞతలు .

      తొలగించు
  4. హార్థిక జన్మదిన శుభాకాంక్షలు! మీరిలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రసఙ్ఞ గారూ ,
      తమ సహృదయతకు కృతఙ్ఞతా పూర్వక ధన్యవాదములు .

      తొలగించు
  5. గురుతర బాధ్యత నిజముగ
    గురువై నెరవేర్చినంత కువలయములవే
    సరియగు వృద్ధిని గాంచును
    పరిపరి వందనమిడుదును భక్తిని కృష్ణా!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. లక్ష్మీదేవి గారూ ,
      తమ సహృదయతా వ్యాఖ్యకు కృతఙ్ఞతలు .

      జగదా చార్యుడు కృష్ణడు
      జగతికి బోధించి గీత జగతీ గురుడై
      జగతికి చూపిన మార్గమె
      జగతిని గల గురువులెల్ల చరియింప నగున్

      తొలగించు
  6. మాష్టారు.. లేట్ గా చూసాను మీ టపా!
    జన్మదిన శుభాకాంక్షలు మీకు!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జలతారు వెన్నెల గారూ ,
      తమ ఆదరాభిమానాలకు సర్వదా కృతఙ్ఞుడను .

      తొలగించు
  7. మాస్టారూ... జన్మదిన శుభాకాంక్షలు. మీవంటి గురువుల సంఖ్య పెరగవలసిన అవసరం చాలా ఉంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. రాజా గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు , మన్నించాలి స్కూల్ పనుల్లో పడి లేట్ గా చూసాను.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. తమ ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు మరయు ధన్యవాదములు ఫాతిమా జీ !

      తొలగించు
  9. మీరు ఉపాధ్యా వృత్తి లో జీవించారు మాస్టారు.ఎందరికో మీరు ఆదర్శం.

    ప్రత్యుత్తరంతొలగించు