సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, జులై 2012, గురువారం

రాజాధి రాజా శ్రీ యోగి రాజా


రాజాధి రాజా శ్రీ యోగి రాజా

శిరిడీ నివాసా శ్రీ సాయి రాజా     // రాజాధి //



మదిలోన కొలువైన మామంచి దేవా

చెవులకు యింపైన శుభ సాయి నామా  //రాజాధి //



ఆపదల నున్నపుడు అండగా నిలిచావు

ఆర్తిలో నున్నపుడు అక్కున జేర్చావు    // రాజాధి //



బాధలందున్నపుడు ప్రక్కన నిలిచావు

వేదనల నున్నపుడు ఆదుకున్నావు      // రాజాధి //



గీతా చార్యుడై గురుడవై పొడసూపి

సాకేత రాముడై సాయియై నిలిచావు   //రాజాధి //    



సర్వ సుమన శ్శక్తి సంపన్ను డగు నిన్ను

ఎల్ల వేళళ కొలిచి తలచేము తండ్రీ         // రాజాధి  //



బాబ బాబా యని పరి పరి పిలిచేము

మా భాగ్యమగు నిన్ను మరి మరి కొలిచేము // రాజాధి //  

11 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది రాజారావు గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. బాగుందండి..నాకు అర్ధమయ్యేంత సులువుగా రాసారు.

    రిప్లయితొలగించండి
  3. యెంత బాగా వ్రాసారు...బాబా అంటే చాలు ఆయన వచ్చేస్తారు

    రిప్లయితొలగించండి
  4. అరుదైన ఆత్మీయ నేస్తం !
    ఫాతిమాజీ!
    భగవంతుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని

    రిప్లయితొలగించండి
  5. శశికళ గారూ ,
    సాయినాధుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని .
    ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి