సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

27, ఆగస్టు 2012, సోమవారం

" విజయతే గోపాల చూడామణీ "



శ్రీకృష్ణ కర్ణామృతం లోని సంస్కృత శ్లోకానికి నా తెలుగు పద్యం

శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
చెవుల కుండల దీప్తి చెలువు వాడు
నుదుటిపై కస్తూరి మృదు తిలకము వాడు
ఉరమున కౌస్తుభం బొలయు వాడు
నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
కరమున వేణువు మెరయు వాడు
చర్చిత మైపూత సరి చందనము వాడు
గళమున ముత్యాల కాంతి వాడు

తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
నంద గోపాల బాలు డానంద హేల
లీల బృందావనము రాస కేళి దేల
వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .
















9 కామెంట్‌లు:

  1. మీరు చాదస్తం అనుకోకుంటే, "తెలుగు"పద్యంలో సంస్కృతమే ఎక్కువగా కనబడుతోంది.

    రిప్లయితొలగించండి
  2. సార్ ,
    ఖచ్చిత మైన మీ మంచి వ్యాఖ్యను సంతోషంగా స్వీకరిస్తూ , ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  3. సర్, నిజమే తెలుగులో చెప్పాలన్నా సాదారణ భాష అందము నీయదేమో అనే మీ సంశయం సంస్కృత భాషకు స్వీకారం చుట్టింది.
    పై పద్యం నకు దీటైన అనువాదం కదా.. అందుకే అంత అందం చేకూరినదేమో...మెరాజ్.

    రిప్లయితొలగించండి

  4. రాజారావు గారూ!
    మీరు వేరే బ్లాగ్ లో వ్రాసినది నేను కాపీ చేసి దాచుకున్నాను...
    సరళమైన పదాలతో అల్లిన శ్రీ కృష్ణ స్తుతి....
    చాలా బాగుంది...
    అభినందనలు మీకు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుందండి ఈ తెలుగు పద్యం మాస్టారు గారు!

    రిప్లయితొలగించండి