సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, నవంబర్ 2012, బుధవారం

మనదేశం – మనగీతం





మనదేశం – మనగీతం
మనదేశం మనగీతం   మహనీయత చాటుదాం
అడుగడుగున జాతీయత   అంతరాన నిలుపుదాం           // మన //
 
జన గణ మన పాడుదాం   జనయిత్రిని పొగుడుదాం
వందే మాతర మందాం    వందనా లర్పిద్దాం                  // మన //
 
మహనీయుల జీవితాల   కథలు చదువుదాం
మనసంతా దేశ భక్తి    మకరందం నింపుదాం                 // మన //
 
పౌరసత్వ బాధ్యతలను   పక్కాగా పాటిద్దాం
గత కాలం కన్న మించు   ఘనత  నిలుపుదాం     // మన //
 
అన్న దమ్ములకు మల్లే   హుందాగా జీవిద్దాం
ప్రపంచాన భరత జాతి   ప్రతిష్ఠ పెంచుదాం                     // మన //
 
 
 
 
 
 

6 కామెంట్‌లు:

  1. బాగుంది మాష్టారు. తప్పకుండా అలాగే నడుచుకుందాము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారూ ,
      ధన్యవాదములు . జాతీయ భావనల వైపు ఉత్తేజిత మయ్యే రాతలు మన బ్లాగర్లనుండి ఇతోథికంగా రావాలి .

      తొలగించండి
  2. గీతం చాలా బాగుంది. మనసులో మకరందం నింపుకుని అలా నడిచేందుకు ప్రయత్నం చేద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వనజ వనమాలి గారూ ,
      ధన్యవాదములు . నేటి మన దేశంలో జాతీయ సమైక్యత , దేశ భక్తి అవసరాన్ని గుర్తించండి . ఆ మేరకు ఉత్తేజ పరిచే పోష్టులు ప్రచురించండి.

      తొలగించండి
  3. చాలా బాగుంది మాష్టారూ పాట .

    రిప్లయితొలగించండి
  4. సుభ గారూ ,
    ధన్యవాదములు .
    మీరు కమ్మని తెలుగులో పాటలు రాస్తున్నారు . శ్రావ్యంగా పాడు తున్నారు .
    దేశీయ సంపదలు స్వార్థ పరుల చేతుల్లోకి వెళ్తున్న నేటి తరుణంలో దేశీయులలో దేశ భక్తి రగిలించే పాటలు రాయండి . బ్లాగర్లంతా మన వంతు కృషి చేద్దాం .

    రిప్లయితొలగించండి