సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, నవంబర్ 2012, గురువారం

ఆమే నా జనయిత్రి






ఆమె ఘనత హిమవన్నగ
ఉత్తుంగ గిరీశ శృంగ
 
ఆమె కీర్తి నిర్జర ఝరి
ధవళ ఫేన దీప్తికి సరి
 
ఆమె వాక్కు వేదోపనిష
దద్భుత సాహిత్య నికష
 
ఆమె యునికి ఉదధి త్రయ
సంవలయిత రత్న గర్భ
 
భరతావని జనియించిన
ప్రతి పౌరుని తనువంతా
 
ఆమె తలపు అణు వణువున
ఆనందపు పులకింత
 
ఆమే నా జనయిత్రి
అద్భుత భారత ధరిత్రి

5 కామెంట్‌లు:

  1. భాగుందండీ. కానీ నిర్ఝరమన్నా ఝరమన్నా ఒకటే కదా? నిర్ఝర ఝరి ప్రయోగం లోని విశిష్టత ఏమిటో వివరిస్తారా?

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములండీ గోపాల కృష్ణా రావు గారూ ,
    నిర్ఝర అనేది టైపాటు . అది నిర్జర .
    నిర్జర ఝరి అంటే గంగా నది .

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు అర్థవంతంగా ఉంది.మీ రసగంగాఝరి ఇట్లా ప్రవహిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది రాజారావు గారూ!
    భారత భూమికి మీ కవితా కానుక...@శ్రీ

    రిప్లయితొలగించండి