సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మార్చి 2012, శనివారం

తెలుగు బ్లాగర్లకు .....పండుగ శుభాకాంక్షలు


రామ జన్మ వలన భూమి పావనమయ్యె

భరత భూమి చరిత ప్రణుతి కెక్కె

రామ నామ జప విరాజిత వివశయై

భరత ఖండమెల్ల పరవశించెపురుషు లందు పుణ్య పురుషుండు రాముడే

పరమ సాధ్వి సీత భార్య యన్న

తమ్ము డన్న ఘనుడు తా లక్ష్మణుడు కదా !

భాగ్య శాలి హనుమ బంటనంగరామ నామ మెచట రంజిల్లి మ్రోగునో

హనుమ యచట నిలిచి యాడు చుండు

హనుమ యుండు చోట నభయమ్ము కొండంత

పృథివి యచట కడు సుభిక్ష మగునురాజ్య పాలనమున ప్రజా రంజకుడయి

ప్రజల పాలించె శ్రీ రామ రాజ్య మనగ

పుడమి నూరూర గుడి గట్టి పూజ లంద

రాము డొక్కడు దప్ప ఏరాజు గలడు ?భారత జాతికి పండుగ

శ్రీరామ జయంతి నాడు , చెప్పెద మిగులన్

నోరార శుభాకాంక్షలు

కోరి తెలుగు బ్లాగరులకు కూరిమి తోడన్
30, మార్చి 2012, శుక్రవారం

చదువు వల్లనె మార్పు సుసాధ్యమగును


స్వార్థమే రూపు దాల్చిన జనుల వల్ల

జాతి నిర్వీర్య మయ్యె - హింస , యవినీతి ,

దోపిడీ , మోస మేదియు పాప మనక

డబ్బు కోసమే బ్రతుకు బడాయి యయ్యెఇట్టి దయనీయ స్థితిని దాటించు దారి

మనకు చదువొక్కటే – కాని , మంచి లేని

స్వార్థమును నేర్పు నేటి యీ చదువు కాదు

విలువ లను నేర్పు చదువులు వెలయ వలయుస్కూలు వ్యాపార సంస్థయై సోలు చుండ

సత్ప్రవర్తన నేర్పని చదువు లుండ

విలువ లెరుగని టీచర్లు విధుల నుండ

భావి పౌరుల బ్రతుకులు బాగు పడున ?సత్య ధర్మాది యున్నత సద్గుణముల

విలువలను నేర్పు పాఠ్యాంశముల చదువులు ,

ధర్మ నిష్ఠత గల్గు విద్యాలయములు ,

మంచి టీచర్లు గల్గిన మార్పు వచ్చుచదువు పూర్తయి విద్యార్థి - సత్య ధర్మ

వర్తనా మూర్తి మత్వ సంవాసియై , త

నంత విధులలో సౌశీల్యవంతుడై , స

మాజ హితుడై సతత సమ్మాన్యు డగునుచదువు వల్లనె మార్పు సుసాధ్యమగును

చదువు సాంఘిక న్యాయాన్ని చక్కజేయు

చదువె సమ సమాజ సంస్థాప శక్తి

చదువె సంస్కరణ దిశా విజయ పథమ్ము