సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, ఏప్రిల్ 2012, సోమవారం

“ ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు “


ఇల్లు తెగనమ్మి కూతురి పెళ్ళి జేసి

మురిసిపోదురు తలిదండ్రి , ముందు ముందు

భద్రతేలేని కూతురి భవిత గనరు ,

మధ్యతరగతి మన కుటుంబముల వారుతనయ కార్థిక స్వావలంబన తదుపరి

మాత్రమే పెండ్లి ప్రస్థానమై యొనరిన

భద్రతలు గల్గు మహిళకు , భార్య మీద

మగని కధికార తీవ్రత మట్టు కొనునుఆర్ధిక స్వావ లంబిత యైన యతివ

మగ డభద్రతా భావ మందు పడును

తాను వేషాలు వేసిన తగిన శాస్తి

జరుగు నను భయ మతనిలో పెరుగు చుండుదిగువ , ఉన్నత తరగతి స్త్రీల లోని

స్వ స్వతంత్రతా భావ జాల మందు

గలుగు కిటుకిదే , యిచట మగనికి లేదు

మధ్యతరగతి మగనికిమల్లె యహముతల్లి దండ్రికి కూతురి పెళ్ళి మీద

దృష్టి మారి , ఆమె భవిత తీరు మీద

దృష్ట పెట్టిన నాడు ఈ తీరు మారు

ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు