సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జులై 2013, సోమవారం

" స్థానిక సమరం " - లో ఇదొక " విజయమ్మ" కథ ?


ఏమి విజయమ్మా ఈరోజు పిల్లలకు ఏమి వండి పెడుతున్నావు

ఏముంది సారూ అన్నమూ , సాంబారూ , రసమూను

అవును ,  ఈ రోజు మంగళ వారం కదా

అర్థమయ్యింది సారూ , మంగళవారం గుడ్లు వండాలని కదా మీరనేది

మరి ! “

ఒక్కొక్క పిలగాడికి రూపాయి పావలా ఇస్తున్నారు .  గుడ్డు రొండు రూపాయలు . వారానికి

రెండు సార్లు ఏడ దెచ్చేది . మీకు దెలవందేముంది సారూ .  అదికూడా నాలుగు నెలలకోసారి                            బిల్లు లిస్తున్నారు . బతుకు దెరువు లేక బడి పిల్లలకు వండి పెట్టడానికి ఒప్పు కుంటిని .

ఏమి చేసేది .

     నేను గవర్ణమెంటు హైస్కూలు ప్రథానోపాధ్యాయులుగా  నా స్కూల్ కాంప్లెక్సు పరిధిలోని

కొన్ని ప్రాథమిక పాఠశాలలు సందర్శించిన సందర్భమిది . ఇది నాలుగేళ్ళ నాటి సంభాషణం .

                                         -----

     పదేళ్ళ క్రితం విజయమ్మ ఆ మండలానికి మండలాథ్యక్షురాలు . ఆ వూరి యం.పి.టి.సి

యస్.సి మహిళకు రీజర్వు కావడం వల్లా , ఊరి రాజకీయ నాయకుడు ఎంపిక చేయడం వల్లా

విజయమ్మ యం.పి.టి.సి అయ్యింది .

      మండలాథ్యక్ష పదవి  ఆనాడు జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది . మండలంలో

గెలిచిన యం.పి.టి.సి లలో విజయమ్మ ఒక్కరే మహిళ కావడం వల్ల అనూహ్యంగా మండలా

థ్యక్ష పదవి ఆమెను వరించింది .

        అంతకు క్రితం ఆ మండలానికి మండలాథ్యక్షుడుగా ఉన్న ఉన్నత సామాజిక వర్గానికి

చెందిన రాజకీయ నాయకుడు బలాఢ్యుడు . అంగ , అర్థ బలంతో ఆ మండలంలో ఆయన హవానే                      నడుస్తూ ఉంది .

        ఇక షరా మామూలే . మండలాథ్యక్షురాలు విజయమ్మ ప్రతిరోజూ పొద్దున్నే సదరు శ్రీవారి

ఇంటికి వెళ్ళడం , సాయంత్రం వరకూ ఆయింటి యజమానురాలు చెప్పిన పనులు చేయడం ,                           రాత్రికి ఇల్లు చేరడం – ఇదీ విజయమ్మ దిన చర్య .

        విజయమ్మకు పొడి పొడిగా సంతకం చేయడం నేర్పించినారు . చెక్కులూ , ఉత్తర్వులూ ,

తదితరాల మీద అయ్యగారి ఇష్టాయిష్ఠాల మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం ,

అప్పుడప్పుడు జరిగే సమావేశాలలో ఒక అనామకురాలి లాగా బిక్కు బిక్కుమంటూ కూర్చోడం .

        అధికారులూ , అనధి కారులూ ఆమెనసలు మండలాథ్యక్షురాలిగా భావించిన దాఖలాలు

కనబడవు . అధికారమూ . ఆర్భాటమూ అంతా ఆ పెద్దాయనదే మరి . విజయమ్మ నామ మా

త్రం గానే మిగిలి పోయింది . పదవి పోయిన తర్వాత బతుకు తెరువు కోసం నానా పాట్లూ పడుతున్న

ఇలాంటి విజయమ్మలను చూస్తున్నప్పుడు మనస్సు చివుక్కు మంటోంది . ఇది పదేళ్ళ నాటి

సంగతి . ఐనా , మార్పు కోసం ఆసించడం తప్ప ఎక్కడా ఆ ధాఖలాలు సుదూరంగా కూడా                        కనిపించడం లేదు .

                                        -----  

         ఉన్నత సామాజిక వర్గాల మహిళలతో సహా స్త్రీలు , బడుగు – బలహీన వర్గాలూ స్థానిక

రిజర్వేషన్ల ద్వారా అందిన పదవులను అనుభవించే పరిస్థితులే లేవు . అధికారమంతా రాజకీయ ,

సామాజిక , ఆర్థిక బలాఢ్యుల చేతుల్లోకి బదిలీ అవుతున్నప్పుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్న

తి ప్రశ్నార్థకమే .

         ఈ సామాజిక దురవస్థకు కారణం మనకు తెలుసు . నిరోధించడానికి మన బాధ్యతగా ఈ సమాజానికి మనమేమి చెప్పాలో యోచించండి .

 

 

4 కామెంట్‌లు:


  1. ప్రశ్న పాఠకులకే వేసారా మాస్టారు?
    "బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ",అని చదువుకున్నాము కానీ,చీమలన్ని ఐకమత్యం తో కలిసి,వారికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఎదురు తిరిగితే మార్పు రాదంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంగ , అర్థ బలవంతుడైన రాజకీయ నాయకునికి నిలువెల్లా విషమే . బలహీనులను ఏకం కానివ్వడు . విద్యావంతులు చురుకుగా వ్యవహరించి సమాజాన్ని చైతన్య పరచ
      గల్గితే ఇలాంటి ఎన్నో సామాజిక దురవస్థలు నిరోధించ బడతాయి .
      స్పందనకు ధన్యవాదాలు .

      తొలగించండి
  2. ఇప్పటికి ఇదే జరుగుతోంది, మార్పెలా వస్తుందో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమబోటి సమాజ హితైషులఆశీస్సులే మార్పుకు శ్రీకారాలు . ధన్యవాదాలు .

      తొలగించండి