సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, ఫిబ్రవరి 2014, గురువారం

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

పరగు విశ్వ మనంతము , భ్రమణ రూప

చలన చాలన సంవృత్త శక్తి మయము

అందుగల కోట్ల గ్రహ తారకాది చయము

కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు


                                                                                
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత

యైన బోధ పడుట లేదు , తాను శక్తి

మంతు డెట్లగు? విశ్వనియంత కన్న

నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు



భార్య బిడ్డలు తాను – ఈమాత్ర మైన

చిన్న సంసార బాధ్యతే చేత గాని

మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని

విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?



ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,

పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు

బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన

తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?




ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు

దాతనే మరచు కృతఘ్నతా విధాన

భావనలు గల్గు మానవా! పతన మవకు

భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

6 కామెంట్‌లు:

  1. ఏమీ చేతకాదు కాని మానవునికి అహంకరించడం బాగా తెలుసు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదనే నిజం తెలిసీ అంతా నా మహిమే నంటున్నాడు మనిషి .
      ధన్యవాదములు శర్మగారూ ,

      తొలగించండి
  2. కష్టేఫలే శర్మగారి అభిప్రాయమే నాది కూడా.
    నిజమే మాస్టారు గారు,
    మానవునికి అహకరించడమే తెలుసు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడు గడుగునా బ్రమలలో బ్రతుకీడుస్తూ నేనే గొప్ప అంటే చెల్లు బాటువుతుందా? భారతి గారూ! ఈ విషయంలో తల పండిన పండితులు కూడా పంతాలకు పోవడం విచిత్రంగా అనిపిస్తుంది .
      ధన్యవాదములు

      తొలగించండి
  3. తమ ఉనికిని గొప్పగా చాటుకోవటానికి మానవుడు తాపత్రయ పడుతూనే ఉంటాడు,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మానవత్వం నిలుపుకో గలిగితే చాలు , మహనీయత మాట దేవుడెరుగు .
      మెరాజ్ గారూ , ధన్యవాదములు .

      తొలగించండి