సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓం నమో శ్రీ సాయి నాధాయతలకు గట్టిన గుడ్డ  యిలకు రక్షగ నిల్చి

తరగని ప్రేమకు తావిడంగ

నిడు పాటి నుదుటిపై  నెలకొన్న తేజమ్ము

చేతులు జోడించు చిత్తమొసగ

అర్థ నిమీలితమై  యలౌకిక తపో

మగ్నమౌ కన్నులు మనసు దోచ

మంగళాకరములౌ మహనీయ పాదముల్

తాకి కళ్ళద్దుకో తలపు దోప

సాయి నాధుండు ద్వారకా మాయి వెలసి

సకల ప్రాణుల తోడుగా సాక్షి యగుచు

వాడ వాడల కొలువుండి వరదు డగుట

పుడమి భారతి చేసిన పుణ్య ఫలము .శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ


             హితబోధ చేసిన హితు డితండు

రెండు రూపాయల దండి దక్షిణ గొని

             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు

రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి

            తాననుభవించిన త్యాగ మూర్తి

' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ

            మాదుకొను కరుణామయు డితండు


సర్వ దేవతా సత్తాక సద్గురుండు

సాయి నాధుని  శరణంచు శరణు వేడి

చరణములు తాకి తరియింత్రు సకల జనులు

శరణు శరణంచు వేడితి సాయి !   రార .

                                                                  


 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి