సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, సెప్టెంబర్ 2015, బుధవారం

దైవం లేని దెక్కడ ?


 
మానవ జీవనావసరాలలో జ్ఞానానికి తొలి ప్రాధాన్యతనిచ్చి జ్ఞానాన్ని దైవంగా భావించడం జరిగింది .

అందుకు ప్రతీకగా సరస్వతీ _ బ్రహ్మల మూర్తులను రూపొందించుకొని అర్చించినారు .

పాడి పంటలు  మొదలైన సర్వ సంపదలనూ ఆరాధనా భావంతో కొలిచి అందుకు ప్రతీకగా  లక్ష్మీ _ విష్ణు

మూర్తులను రూపొందించుకొని అర్చిస్తున్నారు . సృష్టికి మూలమైన స్త్రీ పురుష తత్త్వపు పవిత్రతకు

ప్రతీకగా లింగ రూపంలో పార్వతీ పరమేశ్వర మూర్తులను రూపొందించుకొని అభిషేకిస్తున్నారు .  

మానవ మనుగడకు ఆధారభూతాలైన భూమినీ , నీటినీ , నిప్పునూ , గాలినీ గౌరవించి

వాటికి ప్రతీకలుగా దేవతా మూర్తులను రూపొందించి కొలుస్తున్నారు .

తలపెట్టిన కార్యంలో విజయం సిధ్ధించాలంటే అవసరమైనది బుధ్ధి కుశలత . బుధ్ధి కుశలత

ద్వారా విజయం సిధ్ధించడమనే భావనకు ప్రతీకగా గణేష్ మూర్తిని రూపొందించి ప్రార్థిస్తున్నారు .

నదులను పుణ్యతీర్థాలుగా , పర్వతాలను పుణ్యక్షేత్రాలుగా , అడవులను వనదేవతలుగా ,

ప్రకృతిని ప్రకృతి మాతగా  _  ఇలా విశ్లేషిస్తూ పోతే  ,  భారతీయ తాత్వికతలో చెట్టూ , పుట్టా ,

జంతువూ , పక్షీ   _  ప్రతిదీ మానవ మనుగడకు అవసరమై  తద్వారా  పూజార్హమై కొలవ బడుతున్నవి .

ఇలా , మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ  _  అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం

కావచ్చు . మరి , భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ  ?    

 

         ఐతే _ జ్ఞానం , సంపద , కార్య సిధ్ధి  మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం

బంధమైన అవగాహన , పట్టుదల , కృషి  మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి . కృషిని వదిలి , దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయ మాటల వల్ల , మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు .

మౌఢ్యాన్ని వీడిన  చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య , జ్ఞాన , ఆనంద పరవశులౌతారు .  

 

           ఇక , యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాల

లోని మానవ సమాజాలను చైతన్య పరచి , అండగా నిలిచి ఆరాధ్యులైనారు . కృతజ్ఞతగా ఆయా

మహాను భావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి , పూజించడం , వారి జయంతులను

పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం .

ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే , శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుధ్ధుడు , సాయి మహరాజ్  , క్రీస్తు , మహమ్మదు _

ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు .

             ఇంకా , ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుం

టున్నారు . మరి , భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ ?  దైవం లేనిదెక్కడ ?  మలిన మస్తిష్కాలలో తప్ప .  

4 వ్యాఖ్యలు:

  1. బాగున్నారా మాస్టారుగారు!

    భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ ? దైవం లేనిదెక్కడ ? మలిన మస్తిష్కాలలో తప్ప ... లెస్సగా చెప్పారు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. భారతి గారు,
      చక్కగా చెప్పారు. భగవత్తత్త్వం అన్ని ఉపాధులయందునూ సమానంగానే భాసిస్తున్నప్పటికీ అనేక ఉపాధులను ఆవరించి యున్న మాయ అనే మురికి కారణంగా వాటి యందు దాని ప్రకాశం మరుగుపడి ఉంటున్నది. వాస్తవం.

      తొలగించు
    2. భారతి గారూ ,
      మీ సహృదయ పూర్వక వ్యాఖ్యకు ధన్యవాదములండీ . మీరూ కుశలమే కదా !

      తొలగించు
  2. శ్యామల రావు గారూ ,
    తమ సౌమనస్య పూర్వక వ్యాఖ్యకు స్వాగతములు .

    ప్రత్యుత్తరంతొలగించు