సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, నవంబర్ 2015, ఆదివారం

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని .....

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని
పేర్చి నోటి దురద తీర్చు వారు
వదరు కూతలు కొన్ని వాచాలతలు కొన్ని
వార్చి  అహంభావ మేర్చు వారు
కించ పరుచ కొన్ని  కించ పడగ కొన్ని
తలకెత్తుకొని మోసి తనియు వారు
పాండిత్యములు కొన్ని  పరిహాసములు కొన్ని
కవ్వించి వెకిలిగా నవ్వు వారు

ప్రాత సంప్రదాయపు వర్గ పండితులును
క్రొత్త విజ్ఞానమయ వర్గ కోవిదులును
లంకె కుదరక తిట్ల పురాణములకు
దిగుట యిదియేమి కర్మరా తెలుగువాడ .

5 కామెంట్‌లు:


  1. లక్కాకుల వారు సహభేషైన మాటన్నారు .

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములండీ . వరూధినీ బ్లాగు లో ఇంతకు ముందు హాస్యాన్ని చదివి ఆనందించే వాణ్ణి . ఇప్పుడు పరిహాసాన్ని చదివి , చదవడానికి మనస్కరించడం లేదు . మీకే గాదు , ఇంకా కొందరికి .....
    కూటిక ! గుడ్డకా ! బుధులు కూడ పగల్నెగద్రోసి హింసికా
    పాటవమెంతొ గొప్పదను భావన నుండుట _ నేర్తురేని మీ
    మాటల నేర్పులింపెసగ మ్రాన్పుడపార్ధము _ చేతగాద ? ఆ
    పాటవమేమి లేద ? విన వద్దిక , మేలగు , మిన్నకుండుటల్ .

    రిప్లయితొలగించండి

  3. లక్కాకుల వారు ,

    చాలా బాగా చెప్పారు . కొన్ని మార్లు ఇట్లాంటి రియాక్షన్ రప్పించండానికి, బ్లాగ్ లోకపు పోకడలు తెలియజేయడానికి ఆ ఎకసేక్కం టపాలు పట్టుకొచ్చి పెట్టవలె ; అప్పుడే ఏ ఒక్కరో కాదు ఇద్దరో కాదు చాలా మంది బ్లాగర్లకు ఇవి సుతరామూ నచ్చవని తెలిసి వస్తుంది.

    మీలాగే ఇంకా మరిన్ని బ్లాగర్లు వీటికి వ్యతిరేకత తెలియ బరుస్తారని ఆశిస్తాను.

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మనిషి మనో మనోజ్ఞతలు మర్మము లేక చరించగా వలెన్
    మనిషి మనీషియౌనటుల మాటల మన్నన లుండగా దగున్
    మనిషి మహోన్నతత్త్వమె ప్రమాణముగా పనులుండగా దగున్
    మనసులు నొవ్వగా విసురు మాటల బాటలు చిన్నబుచ్చవా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ మధ్య మీరు రాస్తున్న కవితా పరంపరలో ఇది మరో ఆణిముత్యం ! అభినందనలు.

      తొలగించండి