సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, అక్టోబర్ 2016, శనివారం

వాగ్దేవి ! శారదా ! వందనములు .

నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లే తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించే తల్లి !
పరదేవతా ! మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

6 వ్యాఖ్యలు:

 1. పద్యం బాగుంది.
  జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మిత్రులు శర్మ గార్కి ధన్యవాదములు , అభివాదములు .

  పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
  హంస నెక్కి తిరుగు నజుని రాణి
  మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
  మనల గాచు గాత ! మంజు వాణి .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. తమరి మెచ్చుకోలు స్తవనీయమై గ్రాలు
   తల్లి స్పటిక మాల తళుకు వోలె
   పలుకు పలుకు నందు పులఖండముల జల్లు
   శర్మ గారి పలుకు చక్కెరొలుకు .

   తొలగించు
 4. శారద! నిను వేడెద వి
  స్తారముగా భావమెల్ల సార్థకముగనన్
  సారము గాంచగ పద్యమ
  పారముగ సుమధురముగను పలుకుల తల్లీ

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తెల్ల దామరలోని తీపు విత్తులు మెక్కి
  తల్లి యెక్కు హంస తనియు నట్లు
  సతము బ్లాగు లోక సాహిత్యములు మెక్కి
  తనియు మిమ్ము వొగడ తరము గాదు .

  ప్రత్యుత్తరంతొలగించు