సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, అక్టోబర్ 2016, సోమవారం

ఎవ్వార లీవిశ్వ .....

ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి  తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

4 వ్యాఖ్యలు:

 1. బాగుంది, అమ్మ
  ”తాటంక యుగళీభూత తపనోడుప మండలా”.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తరణిని తారాధి పతిని
   తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
   పరదేవతను మనంబున
   పరి పరి భావించుటెంత భాగ్యమొ యరయన్ .

   తొలగించు

 2. అంతటయు నిండి తనయం
  దంతయు యుండగ మహత్వ ధామం బగుచున్
  చెంతన చైతన్యంబగు
  నెంతయు కరుణా కటాక్ష నేత్రీం భజరే !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సంతోషంబిడె , పద్యా
   ద్యంతము ప్రతిభా విభవ వితానము విరిసెన్ ,
   సాంతం బాయమ్మ దయా
   మంతంబగు పట్టు మీది , మంచిది విహితా !

   తొలగించు