సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, అక్టోబర్ 2016, మంగళవారం

అమ్మ సందేశం .....

చెడుపై కడదాకా యీ
పుడమిని పోరాడి దుర్గ  పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .

చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .

ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని  దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .

మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్

అమ్మ చెప్పినదిది , నమ్మి  తనంతగా
నెవడు పూని  సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి  చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు  వచ్చి దుర్గ .

4 కామెంట్‌లు:

  1. దుష్టదూరా,దురాచార శమనీ, దోషవర్జితా
    సర్వజ్ఞా,సాంద్ర కరుణా, సమానాధికవర్జితా

    రిప్లయితొలగించండి