సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, మార్చి 2017, బుధవారం

వెంకయ్య స్వామి శతకం -- 1

                 

 భగవాన్
       శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి
          ఆరాధన రూప పద్య శతకం            
                ( పరిచయము -- 1)
                   ----------------
         నేటి కాలంలో ఏ మలినమూ అంటని
మహాను భావులరుదు .అలాంటిమహనీయులలో
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకరు .
          శ్రీ స్వామి నెల్లూరు జిల్లా , నాగులేటూరు గ్రామంలోవ్యవసాయకుటుంబంలోజన్మించినాడు .
బాల్యంలో వ్యవసాయం పనులు చేసే వాడు .
ఇరవై యేళ్ళ వయసులో ఊరొదిలి పెన్నానది లో
నూ , పెన్నకిరువైపుల గ్రామాలలోనూ తిరుగుచుం
డేవాడు .
         తనలోకంలో తానుండేవాడు . తదనంతర
కాలంలో తదేక ధ్యానంలో తంబూర మీటుతూ
తన కనువైన స్థలంలో గడిపే వాడు .  క్రమంగా
ఆప్రాంత ప్రజలు వెంకయ్య స్వామిగా గుర్తించి
గౌరవించడం ప్రారంభ మయ్యింది .
          ఆయన ఏది చెబితే అది జరిగేది . రోగగ్ర
స్తులకు మంత్రించి నయం చేసేవాడు . ఎవ్వరినీ
ఏదీ అడిగేవాడు కాదు . పిలిచి అన్నం పెట్టేవారు .
స్వామిని బాల్యమాది నేనెరుగుదును . మా గ్రా
మం కుల్లూరికి ప్రక్కన రాజుపాళెంలోనూ , కాస్త
దూరంలోని పెన్నబద్వేలు లోనూ ఎక్కువ గడిపే
వాడు . చాల నిరాడంబర జీవితం గడిపి నాడు .
            అర్థ ముతక చొక్కా ముతక పంచ ఆయన ఆస్తి . పైపంచ చుట్ట చుట్టి ప్రక్కన పెట్టు
కుని దానితో విసిరి మంత్రించి జబ్బులు నయం
చేసేవాడు . తినడం భిక్షాన్నమే .             కార్యార్థమై వచ్చి అడిగిన వాళ్ళకు చీటీ వ్రాయించి వ్రేలిముద్రలేసిఇచ్చేవాడు .ఆయనమాట విన్న
వాళ్ళంతాబాగుపడ్డారు .వినకచెడినవాళ్ళూఉన్నా రు .
              దాదాపు ఎనభై యేళ్ళదాకా బ్రతికి జ
నుల చేత భగవానుడిగా పూజింపబడి , చివరి
దశలో గొలగమూడి గ్రామంలో సమాధియైనాడు .
ఆ సమాథియే శ్రీస్వామి దేవాలయంగా , గొలగ
మూడి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నవి .
              ఈక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగార
మై వారి కోరికలు తీరుతూ భక్తజన సందోహంగా
మారింది . నేనెరిగిన వెంకయ్య స్వామి జీవిత
చరిత్రను ఉన్నదున్నట్లుగా పూర్వం ' భగవాన్ శ్రీ
శ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి సత్య ప్రమాణ దివ్య చరితము ' గా వ్రాయడం జరిగింది .
              స్వచ్చమైన జీవితం గడిపి జనులతో
మమేకమై ఆత్మశక్తితో జనుల బాధలను తొలగిం
చిన ఆ నిరాడంబరుడు నా కారాథ్యుడు .
             చిన్న చిన్న ఆటవెలది పద్యాలతో ఆ స్వా
మి మహనీయ తత్త్వాన్ని ఆరాధిస్తూ శతకం వ్రా
యడం జరిగింది .
                ----- వెంకట రాజారావు . లక్కాకుల
              

9 కామెంట్‌లు:

  1. రాజారావు గారూ,
    చాలా సంతోషం. మీ‌ శతకం‌ పద్యాలకోసం ఎదురు చూస్తాము.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారు,
    మహనీయుల జీవితాలు, బోధనలూ,
    పరిచయ రచనలూ ఎల్లప్పుడూ
    ఆహ్వానింప దగినవీ, తెలుసుకో
    దగినవీను. awaiting sir ...

    మీకు మీ కుటుంబానికి తెలుగు
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమల్లీశ్వర రావు గారూ !
      అతి నిరాడంబరమైన , స్వచ్చాతి స్వచ్చమైన ,
      అత్యంత మహనీయమైన ఇలాంటి మహానుభావు
      లంటే నాకిష్టం . వీరిని స్వయంగా నేనెరుగుదును .
      నా శక్తి మేరకు , వారి జీవితంలోని సంఘటనలా
      ధారంగా ఆరాధనా రూపంగా గతవారం రోజులుగా
      వ్రాసి పెట్టుకున్న పద్యాలను పుస్తక రూపంగా ఆనం
      దంగా ప్రకటిస్తున్నాను .
      ---- మీకూ , మీకుటుంబానికీ ఉగాది
      శుభాకాంక్షలు .

      తొలగించండి


  3. తేట గీతి యాటవెలది తీరు గాన
    మంచి మాటల వెంకయ్య మదిని తెలుపు
    పద్య శతకము రీతిని పరము దెలుపు
    గురువుల కథల వినవమ్మ గుణికి తెలియ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాడి గెల్చు ' గీతి ' , ఆడి గెల్చు ' వెలది '
      తెలుగు గెల్చు ' గీతి - వెలది ' కూడి
      ' వెలది - గీతి ' రీతి తెలిసిన కవివరుల్
      ' తెలుగు పద్య ' మందు గెలువ గలరు .

      తొలగించండి
  4. వెంకయ్య స్వామి గురించి గురు చరిత్రలో చదివాను.వారిని తెలియడంతో మీరు ధన్యులు. స్వామి చరిత్ర పద్యరూపంలో ఎదురు చూస్తున్నా

    రిప్లయితొలగించండి