సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

28, మార్చి 2017, మంగళవారం

తెలుగుగాది .....

అల్లదే టీవీలొ అడ్డ నామాలోళ్ళు
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ

హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది  పర్వదిన మ్మిల మీదికి దిగి .

అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .

2 వ్యాఖ్యలు: 1. శుభాకాంక్షలతో


  రాజన్న చెప్పెను జి లే
  బీ జవ గొను హేవిళంబి ! బిరబిర గానన్
  గోజీ న హేమలంబగ
  రాజస మొప్పగ గనపడి రాణించితివీ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బ్లాగరు జిలేబి గారూ !
   రాగల సంవత్సరమ్ము రమణీయంబై
   భోగాలకు సంపదలకు
   రాగాలకు నిలయమౌను ' రాజస ' మొప్పన్ .

   తొలగించు