అల్లదే టీవీలొ అడ్డ నామాలోళ్ళు
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ
హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది పర్వదిన మ్మిల మీదికి దిగి .
అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .
రిప్లయితొలగించండిశుభాకాంక్షలతో
రాజన్న చెప్పెను జి లే
బీ జవ గొను హేవిళంబి ! బిరబిర గానన్
గోజీ న హేమలంబగ
రాజస మొప్పగ గనపడి రాణించితివీ !
జిలేబి
బ్లాగరు జిలేబి గారూ !
తొలగించండిరాగల సంవత్సరమ్ము రమణీయంబై
భోగాలకు సంపదలకు
రాగాలకు నిలయమౌను ' రాజస ' మొప్పన్ .