సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, మార్చి 2017, బుధవారం

తల్లీ ! వందనము .....

ఇల్లు పిల్లల బాధ్యతల్ యెల్ల వేళ ,
ఇప్పుడో , వీటితో పాటు యింతులు మరి
పట్టి రుద్యోగ భాద్యతల్ , భారతీయ
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

మగనికిని పిల్ల లత్త మామలకు జేసి
 మరల నుద్యోగ భాద్యతల్ , మగుడ ' నిల్లు-
పిల్ల '  లిదె ' తనలోక ' , మీతల్లి పనులు
వేకువన లేవ నేరాత్రి వేళొ తీరు .

ప్రొద్దెక్కి నిద్ర లేచును
తద్దయు లేటైనదంచు తద్ధిమి తకతోం
ఒద్దిక లేదేనాడును
బుద్ధి యెపుడు గలుగు నిట్టి పురుషుడికమ్మా !

ఆఫీసు నుండి యింటికి
సాఫీగా రాడు సారు , చాల పనులహో !
తాపీగా పదకుండుకు
పాపలు నిదురోయినాక , పరుగున వచ్చున్ .

ఇట్టి మగవాళ్ళ నదుపులో బెట్ట , దిన ది
నమ్ము పోరాడి సంసార నౌక నొడ్డు
జేర్చు నోరిమికి సలాము జేతు మమ్మ !
తల్లి ! మాకు ' నీవే ' కల్ప వల్లి వమ్మ !

4 వ్యాఖ్యలు: 1. తల్లీ ! వందన మనిరీ
  యుల్లము నెరయగ జిలేబి యున్నతి నిమ్మా
  జల్లన మనవలెను ధరణి
  చల్లని నీ దయ కరుణయు జలజల పారన్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ' తల్లీ వందన మాచరింతు ననగా ' తా వచ్చె ' మాయమ్మ ' , ప్రాం
   చల్లీలా పద పద్య భావనలతో సౌరుల్ ప్రసాదించగా ,
   మెల్లంజూపుల మేలుబంతి గద ! ' మామీ ' , నేటి ' స్త్రీ పూజితా '
   లల్లే రోజున , మాకు డెందమున స్నేహార్థంబు పెల్లయ్యెడున్ .

   తొలగించు
 2. తల్లికి వందనమిడిన మీకు వందనం!

  ప్రత్యుత్తరంతొలగించు