సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, ఏప్రిల్ 2017, బుధవారం

మా కుల్లూరు -- 11

మా కుల్లూరు -- 11
---------------------
నెల్లూరు దాటి వచ్చిన
కుల్లూరే దిక్కు , చదువు కొనుటకు , చాలా
పల్లెలు , నెల్లూరు కడప
జిల్లా వాళ్ళిటకు వచ్చి చేరిరి చదువన్ .

వరద రాజులు నాయుడు వంటి వారు
చేరి హెడ్మాష్టరుగ పని చేసి రిచట ,
కోరి గంగాధరం లాంటి గొప్పవారు
చేరి చదివిరి ఘనులైరి తేరి చూడ .

ఎందరో ఘను లీ స్కూలు నందు జదివి
యున్నతిని బొంది రేనున్ను నుద్యమించి
కోరుకొని వచ్చి యభివృధ్ధి గూర్చి నాడ
కూడి గంగాధరం గారు తోడు నిలువ .

ఏడెకరాలస్థలమున
నాడొక బిల్డింగు గట్టినా , రది మిగులన్
పాడయ్యెను , రేకులు పగి
లాడాడ , రిపేర్లు చేసి తంతట , కోరన్ -

ఎనిమిది పక్కా రూముల
కనుమతి యిప్పించి నారు , కట్టిరి భవనాల్ ,
ఘనముగ గంగాధర్ గా
రనయం మా స్కూలటన్న యభిమానముతో .

కలదు బిల్డింగు ముందు వెన్కలను గ్రౌండు
కంప మొలిచి పాడయ్యె వెన్కాల గ్రౌండు
బాగు చేయించి నామిట్టి పనికి గూడ
పరగ గంగాధరం గారు పాటు పడిరి .

పది పరీక్ష జరుపు పబ్లికు సెంటరు
కోరి విన్నవించ పోరు సలిపి
కాంక్ష దీర్చి నారు గంగాధరం గారు
పాఠశాల గూర్చి ప్రణతు లిడుదు .

ఘాటైన కఠిన వైఖరి
పాటించితి నాడు , స్కూలు బాగు పడుటకై ,
నాటికి నాముందున్నది
దీటుగ మన స్కూలు ప్రగతి దీపించుటలే .

ఆయెన్ అర్వది యెన్మిదేండ్లు పయిగా , హైస్కూలు బెట్టించియున్ ,
వ్రాయంగా మనసాయె కొన్నయిన , కాలాతీతమై పోవునే
మో , యీ మాత్ర చరిత్ర యైన గనరేమో నేటి విద్యార్థులన్
ధ్యేయంబారసి వ్రాసినాడ , నిది గుర్తించండి కుల్లూరులో .

2 వ్యాఖ్యలు:


 1. అరుబది పైబడి వయసున్
  పరిమళ మొప్పారు పద్య పాటవములతో
  జరిగిన కాలపు స్మృతులన్
  సిరిసిరి మువ్వల వలెనిట చిన్కుల నద్దెన్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హరి చందన వృక్షమునకు
  పరువమ్మున కంటె వయసు పండిన మీదన్
  పరిమళము పెరుగు చుండుట
  లరుదేమియు గాదు తవరి కరయమి గలదే !

  ప్రత్యుత్తరంతొలగించు