సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, ఏప్రిల్ 2017, ఆదివారం

మా కుల్లూరు -- 14

మా కుల్లూరు  -- 14
----------------
పోలేరమ్మకు ప్రక్కన
నాలో నొక గుడియు నుండె , నంకమ్మది , యే
కాలముదో , పాడయ్యెను ,
శ్రీలొలుకగ దాని గట్టె శేషయ్య కడున్ .

ఎగువ పాళె మందు భగవతి మహలక్ష్మి
కొలువు దీరె మహిమ గలుగు తల్లి
అచటి భక్తులెల్ల రామెకు కైంకర్య
మొనర జేయు చుంద్రు ఘనము గాగ .

చెరువుకు కోటకు మథ్యన
పరమ శివుని గుడి గలదు , శివార్చన పరు లా
వర రాజాన్వయు లెవరో
చిరకీర్తులు గట్టి రెపుడొ , శిథిలం బయ్యెన్ .

అదిగొ శివుని గుడిని యాదాల కృష్ణయ్య
పట్టు బట్టి మరల గట్టి నాడు
భక్త తతులు వచ్చి పరమేశు పూజలు
జరుగు చున్న వచట చాల ఘనము .

4 వ్యాఖ్యలు: 1. కుల్లూరు గుళ్ళ కథల
  న్నుల్లంబొప్పగ జిలేబి నుడివిరి కవిరాట్
  చల్లగ చూడవలె గురువు
  లెల్లర పరదేవత తెర లెత్తంగ భళా !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పుట్టి నూరి పైన పుణ్యాల గని పైన
  మక్కువ మరి కాస్త యెక్కువండి !
  గుళ్ళు గోపు రాలు కొలువైన దెవుళ్ళు
  గ్రామ జీవ నాన కలగలుపులు .

  ప్రత్యుత్తరంతొలగించు