సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మే 2017, బుధవారం

మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం


మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
------------------------------------------
మా కుల్లూరు గ్రామం చెరువు కట్ట క్రింద ,
అలుగుకూ - కోట శిథిలాలకూ మథ్య
ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది .
మా బాల్యంలో సదరు శిథిలాలలో ఆడుకునే
వాళ్ళం . శివాలయానికి ఉపయోగించిన గోధుమ
వర్ణపు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఊడి చెల్లా
చెదురుగా పడి ఉండేవి . నల్లరాతితో చెక్కబడి
నిగనిగలాడుతూ పెద్ద నంది విగ్రహం కూడా
ఉండేది . దానిని ముక్కలు చేసి దొంగలు
తరలించారని వినికిడి .
         మా కుల్లూరు గ్రామస్థుడు , ప్రస్తుతం బెంగ
ళూరు నివాసి , పరమ ధార్మికుడు శ్రీ యాదాల
కృష్ణయ్య గారు పూనుకొని సదరు శివాలయాన్ని
సర్వాంగ సుందరంగా పునర్నిర్మిస్తున్నారు . తెల్లటి
గ్రానైట్ రాళ్ళు తెప్పించి , ఆలయ నిర్మాణం చేపట్టి
నారు . ఆలయానికి ముందు రాతి స్తంభాలతో సు
విశాలమైన మండప నిర్మాణం చేశారు . పూర్వం
వందల యేళ్ళనాటి మహారాజుల నిర్మాణ శైలిని
బోలి ఆలయం కను విందు చేస్తూ ఉంది .
            మూడెకరాల సువిశాల ఆలయ ప్రాంగణ
మంతా వివిథ పూల మొక్కలతో , వృక్షాలతో
ఆలయం నయన మనోహరంగా రూపు దిద్దుకుం
టోంది . ఈ శివాలయం పేరు గంగాధరేశ్వరాల
యం . కృష్ణయ్య గారి జీవితం ధన్యం .
            జీర్ణోధ్ధరణ సమయంలో ఈప్రదేశంలో
ఒక శిలాశాసనం బయల్పడి ఆలయంలో ప్రతి
ష్టింప బడింది . దీనిపైన శాసనం తమిళ లిపిలో
చెక్కబడి ఉంది . దీనిని తెలుగులోకి తర్జుమా
చేస్తే ఆలయానికి , గ్రామానికీ సంబంధించిన
సమాచారం తెలియగలదు . పాఠకులు ప్రయ
త్నించ గలరు .
 శాసనం
-----------

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి