సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, ఆగస్టు 2017, సోమవారం

మాయ జేసెద వేమిరా ! మమ్ము కృష్ణ !


 ఆడేవు దొంగాట ఆయశోదా దేవి
కొంగు మాటున జేరి రంగు మార్చి
కూడేవు సయ్యాట కోరిన రాధతో
పయ్యెద కొంగు నింపార విడక
పాడేవు మురళి రూపానల జ్వాల ర
గిల్చి జగముల నూగించి బ్రమల
మాడేవు గో గోప చూడా మణులతోడ
మామూలు బాలుడై మసలు కొనుచు

బుధ్ధి మంతుని పగిది రూపున యదేమి
యల్లరిర ? యయ్యొ ! గోపికల్ తల్లడిలిరి ,
జగతి నంతను మోహ విచలిత జేసి
మాయ జేయుదు వేమిరా ! మమ్ము కృష్ణ !

2 వ్యాఖ్యలు:

 1. "పాడేవు మురళి రూపానల జ్వాల రగిల్చి"

  అది హాయి గొలిపే బాధ కలిగించే గానానలజ్వాల :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి సూచన .
  గానానలజ్వాలగా మార్చేద్దాం .
  లలిత గారూ ,
  ధన్వాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు