సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

27, సెప్టెంబర్ 2017, బుధవారం

విన్నపాలు వినవలె ....

పలు భాషల పరిచయములు
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ  లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్

అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని  కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము  మాన్యచరిత !

వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక  తికమక పడి  యే
తీరున నుండిరొ యని  హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?

పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ  క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .

హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !

పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .

2 కామెంట్‌లు:


  1. శ్రీ రాజారావు గారికి

    విన్నపాలు చూచితిమి.
    కష్టేఫలే వారి పైన ఎటువంటి 'ఇది ' యు లేదు.

    వారి పలుకలలో టపాలలో పద్యపు రీతి చందము జాలు వారుతూంటూంది (natural flow) ; వాటిని గమనించి పద్యాల లో కిట్టించి నేర్చుకోవడానికి సులభం గా వుంటుందని చేస్తున్న యతనమంతే .

    కావున ఇందులో ఎటువంటి అపహాస్యానికిన్నూ తావులేదు‌ ; ఉండదు

    ఇట్లు
    జిలేబి

    రిప్లయితొలగించండి