సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, అక్టోబర్ 2017, సోమవారం

మా కుల్లూరు - చదువుల సిరి

చదువులమ్మ మమ్ము చల్లగా దీవించె
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ  జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .

కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .

ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .

తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .

ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .


2 కామెంట్‌లు:


  1. చదువుల సిరి మా కుల్లూ
    రు! దురంధరులు బలిజలు గురువులై వర్ధి
    ల్లి దరుమము తప్పక నడిచి,
    పదిమందికి సాయముగని పరిణితి గనిరౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నిజమే , ధన్యవాదములు .

    ఔను ! సగర్వముగా చెబు
    తాను , మహామహులు మా పితామహులు , ఘనుల్ ,
    ధీ నుతులును , సమరాంగణ
    భానూజ్జ్వలతేజ సములు బలిజకులదొరల్ .

    కుల్లూరు తల్లి కడుపున
    బల్లిదులగు వీరులు , కవి పండితులు , వణిగ్
    తల్లజులును జనియించిరి ,
    తల్లీ ! నీ కడుపు పసిడి ! ధ్యానింతు సదా !

    రిప్లయితొలగించండి