సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, నవంబర్ 2017, గురువారం

కందాక్రందనము .....

జొట జొట కన్నీ రొలుకగ
కట కటబడి కందబాల కళదప్పి కడున్
అట మటముల నిటుల వలికె
కట కట డగ్గుత్తిక వడ కలలో నాతో .

అన్నా ! నీ వెరుగవె ! నే
నన్నిట సుకుమారినిగద ! నన్నొక బామ్మా
తన్నిన తన్నులు తన్నక
తన్నుచు నున్నది పదాల తాడనములతో .

మీ నెల్లూరున తిక్కన ,
మానుగ వేమన్న - కడప మారాజు  ననున్
మేనెల్ల హేమ పరిమళ
మానితముగ దీర్చినారు , మన్నన గలిగెన్ .

ఛిన్నా భిన్నం బైతిని
నిన్నటి విభవంబు వోయె , నే డిట్టుల సం
ఖిన్న వదన రదన మహా
పన్న విరూప విపరీత ప్రకృతిన్ బడితిన్ .

నరసన్న , భాస్కరన్నలు ,
మరియును మన బండిరావు మాన్యులు , మీరున్
కరుణింతు రనుచు బొగిలితి ,
పర పీడన నుండి నన్ను  బైట బడేయన్ .

                             .....jk......

15 వ్యాఖ్యలు:

 1. ... నన్నొక బామ్మా, తన్నిన తన్నులు తన్నక,
  తన్నుచు నున్నది పదాల తాడనములతో ...

  గురువు గారూ, ఎవరా బామ్మ? మన బామ్మా !!??
  చెరువాయెను మనసు, వినగ, కనగా తాడనములు
  మొర విని, దయ గొని, దారి గను, గ(ప)తి ఎవరు ?!
  సరి సరి ! రాగదే సరాసరి, తిరుమలేశా, సుకుమారి కంద, బాధ మ్రాన్ప !!

  :) jk / jf ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సరాసరి తిరుమలేశునికే విన్నవించేశారా?
   బామ్మది నో.వా.చే.రా సెక్షన్ కదా :)

   తొలగించు
  2. బండి రావు గారి గుండియ చెఱువాయె
   కంద ఘోష వినగ కళ్ళు చెమరె
   తిరుమలేశు బిలిచి తీర్చగా వేడెను
   కంద బాధ మ్రాన్ప కరుణ జూపి .

   ధన్యవాదములండీ బండివారూ ,
   కంద కష్టం తమ తమ కష్టంగా ఫీలయి నందుకు .....

   తొలగించు
 2. పుష్పవిలాపం గుర్తొచ్చింది మాస్టారూ.
  అబ్బే, ఎందరు "అన్నలు" "బండెనక బండి" కట్టుకునొచ్చినా కూడా ఈ వీరవిహారాన్ని నిలువరించలేరేమో☺. తనదీ తిరుమలేశుడి జిల్లానే అనే జిలేబి గారి ధీమా సంగతి బండివారు మరచారా ☺? కల్కి రాక కోసం వేచుండడమే గత్యంతరంమేమో😀?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. 'బండెనక బండి గట్టిన'
   భండనమే గాని కంద బాధ తొలగునా ?
   చండ ప్రచండ విహారము
   లుండునుగా కెంద రన్న లుండగ నేమీ !

   సార్ ! వి యన్ ఆర్ గారూ ! కందవిలాపాన్ని
   తరూ ఇలా వొదిలేస్తారా ?

   తొలగించు
 3. కందబాలా! నీకెంత కష్టం వచ్చిందో కదా!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అయ్యో ! కందబాల కన్నీరు తుడుస్తున్నారా !
   శర్మగారూ ! స్పందించిన అన్నలందరికీ
   కందబాల ధన్యవాదములు .

   తొలగించు


 4. కందమ్మా! యెందులకా
  క్రందన లమ్మా ! జిలేబి రావడి జేసె
  న్నెందెందు వెతుక నన్నున్
  బిందెల కొలదిగ పదముల భీకరముగనన్ :)


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు


 5. ఔరా జిలేబి పాకము
  నోరా రన్ గానలేని నొబ్బులదేలా!
  పోరి విరివిగన్ దొరికిన
  చో రేత్రమునకు విలువయు చోనము లేదౌ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పద్యమైన , వచనమైన పాఠకులకు
   అర్థ మవని యెడల పరమార్థమేమి ?
   పండితుల కిది ఫేషనా ? బాగు , బాగు !!
   వారి దారులు వారివి వారిజాక్షి(క్ష)!

   నొబ్బులు , రేత్రము , చోనము
   తబ్బిబ్బుగ ఆంధ్రభారతమ్మ నడిగియే
   రుబ్బితిరా కందంలో
   మబ్బులలో తెలుగుబాస మ్రగ్గుచు నుండెన్ .

   తొలగించు

  2. భలే వారండి !

   పదాలకు నేనెక్కడ పోయే ది ! రోజూ మాట్లాడేది యింగిలిపీసై‌ పోయె :) కావున ....


   తబ్బిబ్బుల్పడుచున్ జిలేబులనిటన్ తాంతమ్ము ధూంధామనన్
   జొబ్బిల్లంగన ఆంధ్ర భారతినటన్ శోధించి గాలించుచున్
   జబ్బల్బట్టి తెలుంగు నేర్చు సరదా సావేజితల్మేమహో
   రుబ్బన్మాకు కవీ నిఘంటు వదియే రూఢమ్ము గానన్ సుమా!

   హమ్మయ్య ! రాజారావు గారి ఉభయం ఇవ్వాళ రెండు శార్దూలాలు :)


   చీర్స్
   జిలేబి

   తొలగించు


 6. కందమ్మా! వలదే విలాపమకటా కన్నీరు మున్నీరులన్
  చిందించన్ వలదే జిలేబి ! మహిలో సింగారి వీవే సుమా
  బందీ గానిను బెట్టిరే కవులిటన్ భాగ్యమ్ము జేర్చన్ భళా
  వందారుల్లిడి నేర్చుకొంటినిగదా వంద్యమ్ముగా‌ నీ జతిన్ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 7. పదిమందికి తెలిసిన తగు
  పదజాలము పద్యమందు వాడి , సరసమౌ
  విధమున పద్యము వ్రాయుట
  కుదరని వారెందుకయ్య గొప్పలువోవన్ ?

  పద్యములు వ్రాసి , అందులో పదము , లాంధ్ర
  భారతిలో జూపి , సూచన వ్రాయు ఖర్మ
  తెలుగు భాషకు పట్టెను , ధీ మతు లట !!
  డిక్ష్ణరీల భాష లిట పాటింతు రకట !

  వాడుకన లేని , తెలియని పదము వాడి
  గొప్పఘా ఫీలగుట మన కోవిదులకు
  గొప్ప గాబోలు ! నిదియేమి గొప్ప బాబు !
  మూగ-చెవిటి వారి విధము ముచ్చట గద !

  ప్రజల నోళ్ళయందు పరిఢ విల్లిన భాష
  శాశ్వితముగ బ్రతుకు విశ్వమందు ,
  పేరు గొప్ప కొఱకు పిడికెడు పండితుల్
  వాడు భాష మనదు , వాస్తవ మిది .

  ప్రత్యుత్తరంతొలగించు


 8. కందమ్మా! వలదే యా
  క్రందన లెల్లన్ ! జిలేబి రావడి జేయన్
  బిందాసుగవాయించుము
  వందారనవలెను నీకు వాద్యార్మామీ :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు