పద్యం - పరమార్థం
*****************
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .
నేనేం చదువుకోలేదండీ!
రిప్లయితొలగించండితెనుగు భాష మీద మక్కువ ఎక్కువ.
ఇటుకల కట్టుబడంటే భయం.
జీవ భాష సాగే ప్రవాహం
తొలగించండినేనేమీ చదువువు కొన
లే! నాకింపైన భాష లెస్సగ తెలుగే !
చానా భయకృత్తు గద
బ్బా నాకు యిటుకల కట్టుబడి కవివర్యా !
మా చదువులు వృత్తి వరకె ,
తొలగించండిమీ చదువులు వృత్తి దాటి మిన్నులు బట్టెన్ ,
సూచనకును మేము తగము
మాచన భాస్కరుల సాటి , మాతర మగునా ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమాన్యుణ్ణి చేస్తిరే సామాన్యుణ్ణి
తొలగించండినమోవాకము గురువరా! __/\__
గురువని సంబోధించుట
తొలగించండిగురువరులకు పాడి గాదు , కోవిదులగు మీ
చరణ రజమునకు గూడా
సరిబోలను నేను , తమరు ఙ్ఞానాంభసులే !
తొలగించండిమాన్యుణ్ణి చేస్తి రే సా
మాన్యుణ్ణి నమో నమో ! సుమధుర కవీశా,
అన్యతరము మాత్రమ్మే
విన్యాసముల విదురుండ విరివి టపాలన్ :)
జిలేబి
మాటే! మాటాడేదే లేదే!
తొలగించండిఏమని చెప్పుదు సుకవీ!!
గుండె గొంతులో కొట్లాడుతున్నదే!!!
తొలగించండిఏమని చెప్పుదు సుకవీ !
మా మాటను తిరగవేసి మామి యిటన్ కం
దామృతముగ మార్చెనుగా !
ఏమో మా పదముల గతి యే కందంబో !
చీర్స్
జిలేబి
తొలగించండిఅట్లా కష్టే ఫలముల్
యెట్లాంటి పరిస్థితులనయిన యెదురుకొనన్
తట్లాటల సరిజేయన్
కొట్లాడెన్ గొంతులోన గుండెగ సుమ్మీ !
జిలేబి
రిప్లయితొలగించండిజనబాహుళ్యపు నాల్కన
మనుజుడ పుట్టెను పలుకులు, మహిత హితంబై
మనుగడ కొరకై భాషయు
కనుక గొలుసున చెఱబట్టకయ కవి దానిన్ !
జిలేబి
తవరు చదువు చున్న తాదృశ తులసి వ
తొలగించండినమ్ము తెలుగు విభవ నందనమ్ము
నాదు మొఱ వినంగ నప్పని చెవులవి
కవి వృషభులు మీకు చవులు గావు .
తొలగించండితెలుగే తెలియని వారమ
య! లబ్జుగన్నిప్పుడే నయా నేర్చుట ఓ
పలుకుల రాజా ! వృషభువు
ల లుకలుక మరియు జిలేబు లన్ గన గలమే ?
జిలేబి
మీరు ఎలా రాసినా బ్రహ్మాండం...
రిప్లయితొలగించండిఆకట్టుకోవాలన్న ఆత్రుత ఆలోచనలు మాలాంటి వారికి మీకు కాదండీ.
పద్మార్పిత గారి ప్రశంశ అంటే
తొలగించండికవితామతల్లి ప్రశంశే నండీ ,
ధన్యవాదాలు .
తొలగించండికవితామ తల్లి వీవే !
మవురీ ! పద్మార్పితా! సుమధురిమ లొలుకన్
నవనవ భావన లెల్లన్
కవనం బయ్యెను జిలేబి కమలంబువలెన్ !
రిప్లయితొలగించండిమీరెట్లా రాసిననూ
ఓరయ్య భళి భళి సూవె ఓరాజన్నా !
ఆరాటమ్ముల్ మాక
య్యా రాసిన రాతలెల్ల యాకాణమ్మే ?:)
జిలేబి
రాజారావుగారు మీరు వ్రాసినట్లు అందరికీ సాధ్యం కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు సుమా!
రిప్లయితొలగించండిఆ ప్రయత్నమే ఇప్పుడు కావలసింది తులసి గారూ ,
తొలగించండికానీ , పద్యాన్ని పదిమందికీ పంచడం పండితులకిష్టంలేదు .
తమది సాంప్రదాయ కవిత్వం . సామాన్యులు ముట్టుకో కూడ
దంటున్నారు .