సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, నవంబర్ 2017, గురువారం

బిడ్డల్ని కనడానికి మంచి రోజులు .....

Courtesy
ఆంధ్రజ్యోతి
ఇరు వర్గాలు – రెండుపంచాంగాలు  
------------------------------------------                                                                                                                       తిథి , నక్షత్రాల ప్రవేశ విషయంలోవాదోప వాదాలు - సామరస్యం కొరవడిన అతిశయాలు -
సందర్భమా - ఆందోళన కరం      
అసలు విషయంలోకి వద్దాం . ఆ రోజు వైద్యం కోసం మా ఆవిడని హాస్పిటల్
కు తీసుకెళ్ళడం జరిగింది . అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .
రిసెప్షన్ హాల్లో నలుగురైదుగురు ఆడవాళ్ళూ , నలుగురైదుగురు మగవాళ్ళూ
పంచాంగాలు తెచ్చుకొని మరీ సప్రమాణంగా వాదించు కుంటున్నారు .
       అమ్మాయికి నెలలు నిండినట్లుంది . సిజేరియన్ అవసరమైన పరిస్థితిలా
కనబడుతోంది . తొలి కాన్పేమో .  అమ్మాయిలో ఆందోళన కనబడుతూఉంది.
హైపర్టెన్షన్కు  గురై ఉండవచ్చు . అందువల్ల నార్మల్ డెలివరీ వరకూ వెయిట్
చెయ్యడం కుదరక పోవచ్చు . డాక్టర్ సిజేరియన్కు సిధ్ధం చేస్తున్నట్టున్నారు .
థియేటరు వద్ద ఆ హడావిడి కన్పిస్తూ ఉంది . ఇదీ సీను .
      అయినా అమ్మాయి ఉన్న ఈ పరిస్థితిలో అసలు వీళ్ళకు తిథులూ నక్షత్రా
ల కోసం వాదులాడు కోవడానికి నిలకడెలా వచ్చిందో నాకైతే అంతు పట్టలేదు .
ఈ కథనంలో కాస్తంత కూడా అవాస్తవంలేదు . తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా
ప్రమాదం జరిగితేనో –
     ఇరువైపుల వాళ్ళల్లో- ఆడవాళ్ళైతే కట్టూ బొట్టూతో ఆర్భాటంగానూ , మగ
వాళ్ళైతే సూటూ బూటూతో అతిశయంగానూ, బాగా చదువుకున్నవాళ్ళ
లాగా కన్పిస్తున్నారు .
      ఆధ్యాత్మికత , దైవం మీద నమ్మకం – ఈ రెండు భావనలూ – వీటిలోని
సత్యాసత్యాలు పక్కన పెడితే – మనిషికి పరిణతినిచ్చి , కట్టడి చేసి ,
సమాజం కొంతవరకు సజావుగా నడవడానికి దోహద పడ్డవి .
      అడుగడుగునా భ్రమలతో , భయాలతో భద్రతలేని జీవన యానంలో
సతమత మయ్యే మనిషి – తనకంటే శక్తి మంతమైన ఉనికిని గుర్తించి,
ఆ శక్తిని దైవంగా భావించి , ఆపదలో తనకు ఆసరా కోసం నమ్మి ,
ఆరాధించడం మొదలై ఉండవచ్చు .
      కానీ , జరుగబోయే పరిణామాలను ముందే గ్రహించగలగడం – తదను  గుణంగా భవష్యత్తును తన అజమాయిషీలోకి తెచ్చుకో జూడడం          దురాశే కాదు , అసాధ్యం కూడాను .
      మరణించేదాకా హాయిగా బతకాలని కోరుకుంటాము . సాధ్యమయ్యే నా?                      
 భవిష్యజ్జీవితంలో జరిగే పరిణామాలేమిటో తెలుసుకో గల్గితే ?
ఎవరైనా చెప్పగల్గితే ? ఈ ఊహే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది .
ఈ బలహీనత లో నుంచే , ఈ దురాశలోనుంచే ఏర్పడిన ’ ఒక సంప్రదాయం’  భారతీయ జీవన విధానంలో భాగమై , శాస్త్ర మనే భ్రమ కల్పించింది .
నేటికీ వెర్రితలలు వేస్తున్న ఈ జాతక చక్రాల మాయ వీడే దెన్నడో ?
మన సమాజాన్ని బ్రమలలో ముంచే ఇలాంటి దుర్మార్గాలు నశించే దెన్నడో ?






5 కామెంట్‌లు:

  1. వంశపారంపర్య జన్యు లోపాలు లేకుండా పిల్లలను కనడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని డిజైనర్ పిల్లలని కనడానికి ఉపయోగిస్తున్నారు. కత్తిని ఎలా ఉపయోగించినా ప్రకృతిని శాసించలేరు కదా ?

    రిప్లయితొలగించండి
  2. పిచ్చి పీక్కి వెల్లిపోడం

    రిప్లయితొలగించండి
  3. తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా
    ప్రమాదం జరిగితేనో –


    అలా జరిగి...బిడ్డల్ని చంపేసుకున్న కేసులెన్నో వున్నాయ్....పిచ్చి లో బ్రతకడం లో సుఖం ఉంటుంది...వాస్తవం లో బ్రతకడం కష్టం...(ముహర్తాలు పెట్టే పంతుళ్ళన్ని...చెప్పులతో కొట్టి...ఆ నిమషం వరకూ బిడ్డ కడుపులో బ్రతక్కపోతే....పబ్లిక్ లో ఉరి తీసే డాక్యుమెంట్ లు సంతకం పెట్టించుకుంటే...ఈ మూహూర్తాలు త్తగ్గుతాయ్)...ఈ పంతుళ్ళను నమ్మి..వారం పది రోజులు..ఆపరేషన్లు పోస్ట్ పోన్ చేసుకుని మృత శిశువుల్ని కన్న మాతలూ...వెళ్ళి సిజేరియన్ కి మూత్రం పెట్టిన పంతుళ్ళని తన్నండి..

    రిప్లయితొలగించండి
  4. Kvsv..Peru tho comment lu choodadam ayinadi...naa WiFi kottadi kaavaadam vallanoo. password leka povadam vallanoo..naa blog logout avakapoyi vundadam vallanoo..evaro naa user name tho comment s petti vuntaarani anukuntunnaa...naa blog poortigaa gaa delete Cheyadam jariginadi..

    రిప్లయితొలగించండి
  5. ఇలా ముహూర్తాలు చూసుకునే మూర్ఖులు ఇంకా ఉండడం విచారం.

    రిప్లయితొలగించండి