సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కనియెన్ రుక్మిణి .....







కనియెన్ రుక్మిణి  ' చంద్ర మండల ముఖున్ , కంఠీరవేంద్రావల
గ్ను , నవాంభోజ దళాక్షు , చారుతర వక్షున్ , మేఘ సంకాశ దే
హు , నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్ , చక్రి , పీతాంబరున్ ,
ఘన భూషాంకితు , కంబు కంఠు , విజయోత్సాహున్ , జగన్మోహనున్ ' .
                          ------ బమ్మెర పోతన

భారతావని చల్లగా బ్రతుకు గాత !

హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు

అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !