' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .
మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీరంగ మెత్తుము తనను దలచి .
ఎంత రమణీయ మీ పూల పుంత ! మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల దీర్చి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు దెచ్చినారు .
కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .
కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !
తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !
మనోజ్ఞమైన తెనుగు పద్యానికి సాటి కలదా! అందమైనది కట్టమన్నదే నా గోస
రిప్లయితొలగించండిపద్యాన్ని పండితులు తప్పులు వెదికే దృష్టితోనే చదువుతున్నారు .
తొలగించండిఇదేమి శాడిజమో అర్థంకాదు . వీళ్ళూ పద్యం వ్రాసే వాళ్ళా ? అనే
చులకన భావం పోవాలి . తమలో ఏమాత్రం సహిష్ణుత మిగిలున్నా వ్రాసినవాణ్ణి ప్రశంసించి ప్రోత్సహించడం అలవరచుకోవాలి .
ధన్యవాదాలు .
'పద్యాన్ని పండితులు తప్పులు వెదికే దృష్టితోనే చదువుతున్నారు'
తొలగించండిదీన్ని నిరశిద్దాం,కాని కొత్త అని, అర్ధం లేనిపదాలు,అర్ధం కాని పదాలు వాడితే, ఎలా ప్రోత్సహించాలంటారు? .
తొలగించండిఅర్థము లేని పదమ్ముల
నర్థము కాని పదముల ఘనమ్ముగ గూర్చన్
సార్థకతేమి గలదయా
వ్యర్థములీ పద్యములు సువర్ణము లైనన్ !
జిలేబి
తొలగించండినాకు తెలియని పదాలను
ఓ కుందనపు పువు బోడి గూర్చకు సుమ్మీ
హేగురు ! మాచన! మీపద
సాగరమును జూచి నేర్వ జాల్వారినవే :)
జిలేబి
రిప్లయితొలగించండికలగాదయా జనులు గట్టిగ యత్నము జేయ పేర్మితో
పలుకుల్ వినూత్నముగ పద్యములెల్లను రూపుదిద్దగన్
వెలుగున్ తెలుంగు మదివేణువు గానముగా సయాటలన్
లలితమ్ముగా నిలచి లబ్జునుగాంచునయా కవీశ్వరా!
చీర్స్
జిలేబి
తెలుగు భాషన్నా , తెలుగు పద్యమన్నా మీకున్న యిష్టానికి జేజేలు .ధన్యవాదములు .
తొలగించండి
రిప్లయితొలగించండిపండితులు చదివి రయ్యా
ఖండన మండనలతో నఖక్షతములతో
పిండిరి క్రొంగొత్త జనుల
దండగ దండగ యనుచు సదా కొఱగనుచున్ !
జిలేబి
కానిండు పద్య సుమములు
రిప్లయితొలగించండిరానిండు మనోజ్ఞ పరిమళాలు పొదివి , యె
వ్వని సొత్తేమి కవిత్వము ?
మనసున కానంద మిడును మనకైన గదా !
రిప్లయితొలగించండిపద్యంబెవ్వడిసొత్తురా నరుడ! రాపాడించి నెట్టేవుగా
సాధ్యంబియ్యది కాదు మీకనుచు యే సాయమ్ములన్ సేయకన్
విద్యార్థుల్ మనకేలరొచ్చు యనుచున్ వీడంగ జేసేవుగా
హృద్యంబై వెలుగియ్యలేక తెలుగే హృత్కాష్ఠమయ్యెన్ గదా!
జిలేబి
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ
రిప్లయితొలగించండిచదువు నిరర్థకమ్ము , గుణ సంయుతు లెవ్వరు తప్పులెన్నుటే
విధిగ గణింప జూడరు వివేకము గోల్పడి , యట్లు జూతురేన్
బుధుల రసజ్ఞ చచ్చువడి బుధ్ధి కృశించి నశించు భాస్కరా !
రిప్లయితొలగించండిపద్యం బాగుందండీ!
ఈ మధ్య మత్తకోకిల ఒకరు అందంగా చెబుతున్నారట విన్నారా?
రాసి పెంచిరి వాసి లేదయె రావుగారటు చూడుడీ !
మూసగా పద మెల్ల గుచ్చగ ముగ్ధ పద్యమనేరుగా!
గోసు గోసుల ప్రాస లెల్లను గోల గోలగ వేసిరే!
కాసువీసపు వార లెల్లరు కంద పద్యము గట్టిరే !
రాశీ వాసి గణింపగా వలదు వారాశంత ఉప్పేగదా !
రిప్లయితొలగించండిచూసీ చూడక వీడుటే సుఖము తేజోమూర్తిమత్ పాండితీ
భాషాభూషణులైన పెద్దలు గదా ! వందారు వందారటం
చీషణ్మాత్రపు మందహాసమిడినన్ యిబ్బందులే రావుగా !
రిప్లయితొలగించండితేజోమూర్తులు పెద్దవారు వలదీ తీరుల్ సుమా మాచనా
ర్యా! జైకొట్టుడయా జిలేబికి సుతారంబై సరే యంచు మీ
కైజారుల్ సయి యప్పుడప్పుడు భళా కైవాట మై కొట్టుడీ
బేజారై పరుగెత్తి పోవలెనయా బెంబేలు గా బామ్మయున్ :)
జిలేబి