సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

7, జనవరి 2018, ఆదివారం

పరమేశ్వర విభూతి

సృష్టి స్థితి లయల నెవడు
స్పష్టముగా గోచరించు పరమేశ్వరుడై ,
నిష్టగ తపించి ఋషులం
తిష్టముగా నెవని గూర్చి తెలిసి తనిసిరో .

శక్తి యతని రూపు , సకల జగతి యతని
చిద్విలాసమ్ము , ప్రేమ భాసించు టతని
తత్త్వ , మతడు విరాట్ సత్య ధర్మ రతుడు ,
దర్శనీయుండు జగతి యంతటను నతడు

అతని సృష్ఠి  కడుమనోఙ్ఞ , మడుగడుగున
నత డగుపడు నన్నింట తా నద్భుతముగ ,
ప్రతి చరాచర రూపమ్ము నతని దివ్య
చేతనా ప్రభావిత వికసిత సుమమ్మె

మొనసి జీవన సంద్రాన మునిగి పోవు
నావ నొడ్డుకు లాగ లేనపుడు మనకు
తోడుగా నిల్చి కాపాడు వాడె యతడు
కష్టములు తీరి నంతనే కనము గాని .....

శక్తి యతని రూపు , సకల జగతి యతని
చిద్విలాసమ్ము , ప్రేమ భాసించు టతని
తత్త్వ , మతడు విరాట్ సత్య ధర్మ రతుడు ,
దర్శనీయుండు జగతి యంతటను నతడు





4 కామెంట్‌లు:

  1. ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!

    రిప్లయితొలగించండి
  2. ఓం నమో నారాయణాయ !
    విష్ణు రూపాయ నమశ్శివాయ
    శివ రూపాయ విష్ణవే
    ఓం నమశ్శివాయ !

    రిప్లయితొలగించండి



  3. మనోజ్ఞు డతడే విభుడు! నమామి! సత్యమై
    అణోరణిగ వెల్గునతడు ! అంతటన్ గలం
    డు! నాధు డగుచున్నఖిలము డూయుచున్ సనా
    తనుండు,మదిలో నిలిచె సుతారమై సదా!

    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మట్టి ప్రమిద లోన మరి కాను పించడు
      నూనె లోన గనగ నోప మతని
      పత్తి లోన దాని వత్తిలో గనరాని
      వాడు దివ్వె లోన వరలు చుండు

      తొలగించండి