సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, ఫిబ్రవరి 2018, గురువారం

అతిమనోహరులైన యశోదాకృష్ణులు

తల్లితో కన్నయ్య తనియు మురిపెమ్ములు
ముగ్గులో చిత్రించు ముదితలార !
ఆనాటి గోపికా మీనాక్షులాయేమి ?
కమలాక్షు కండ్లకు కట్టినారు
ముగ్ధ మోహనరూపు ముద్దుగారెడు , చూడ
కనుగవ చాలదు కాంతలార !
రూప లావణ్యాలు రూపించి చిత్రించి
రమణీయతలకు హారతి పడితిరి

అతి మనోహరమైన యీ ప్రతిమ జూచి ,
కన్ను లానంద పరవశ గతిని జేరి ,
భాష్పములు గ్రమ్మె  , తపమన్న భాగ్యమన్న
తమదె , యేరీతి వొగుడుదు ? తరుణులార !

10 వ్యాఖ్యలు:

 1. తమిళ తరుణులు చాలా అందంగా ఓపికగా తీర్చిదిద్దారే. ముగ్గు చాలా బాగుంది 👏.

  అవును మాస్టారూ పోయినవారంలో మీకు కంటాపరేషన్ అని మిత్రులు బండిరావు గారు ఫోన్లో చెప్పారే 🤔. మరి అప్పుడే మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? కంటికి పుష్కలంగా విశ్రాంతినివ్వండి. త్వరగా కోలుకోవడానికి నా బెస్ట్ విషెస్ 🌹🌼🍎🍎🥕🥕..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు సర్ , తమ ఆప్యాయతతో కూడిన అభిమానానికి .
   ప్రస్తుతం బాగుంది .తమ సలహా అవశ్యం ఆచరణీయం .

   తొలగించు


 2. తమిళ తరుణీ మణులట
  న్నమితముగా పేర్మి గ యవనారిన్ చిత్రిం
  చి మధురముగా గొలిచిరే
  మమత సమతల నెలవు వనమాలి జిలేబీ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తల్లీ కొడుకుల చిత్రం
   బుల్లము వశపరచు కొనుచు నున్నది కృష్ణుం
   డొల్లంత శ్యామ వర్ణము
   తల్లి యశోద తెలుపు మిళితమయి వెలార్చన్ .

   తొలగించు
 3. కంప్యూటర్ వాడుతూనే ఉన్నట్లున్నారు, బ్లాగులో వ్రాస్తూనే ఉన్నట్లున్నారు (ఈ టపాలోను, వేరే టపాల్లోనూ). మాట వినని విద్యార్ధులుంటారని తెలుసు, మాట వినని టీచర్లు కూడా ఉంటారన్నమాట.
  కాబట్టి, ఆపరేషన్ నుండి కోలుకుంటున్న ఈ సమయంలో మీ ఆలనాపాలనా చూస్తున్నవారితో మీ దగ్గర్నుంచి కంప్యూటర్ / లేప్టాప్ / ఐపాడ్ / స్మార్ట్ ఫోన్ తీసేసుకుని ఓ వారం పదిరోజుల పాటు దాచి పెట్టెయ్యమని చెబుదామనుకుంటున్నాను. దయచేసి వారి ఫోన్ నెంబర్ ఇస్తారా మాస్టారూ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సార్ , నరసింహరావుగారూ , ఇక పదిరోజులు కనపడనండీ ,
   మీరు మరీను , స్కూల్లో కొట్టి... ఇంటిలోనూ కొట్టిద్దామనే ...
   ధన్యవాదములు , కృతజ్ఞతలు .

   తొలగించు


  2. సారూ సింహం వలె బ
   డ్డారే వెనుక! కనబడను రా నా సామే !
   వారగ బోయెద కొట్టిం
   చే రావడి వలదయా !కచేరియు వలదోయ్ :)

   తొలగించు
 4. ఇది భేషైన మాట మాస్టారూ 👌.
  కళ్ళు మూసుకుని చక్కగా విశ్రాంతి తీసుకోండి. బ్టాగులే కాదు, టీవీ కూడా చూడకండి. అంతగా తోచట్లేదనిపిస్తే మీ వాళ్ళనెవరినైనా చదివి వినిపించమనండి. చేయించుకున్న చికిత్స యొక్క ఫలం పూర్తిగా దక్కించుకునే ప్రయత్నం మనమే చేసుకోవాలి కదా.
  Wish you speedy recovery 👍.

  (ఇంక నా ఈ వ్యాఖ్యకి - ఎవరి వ్యాఖ్యలకీ కూడా - జవాబు కూడా ప్రస్తుతం టైప్ చెయ్యకండి. తరవాత చూసుకోవచ్చు.)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ పోస్ట్ చదివిన మాకన్నులు ఆనందించెను...కానీ మీ కనులకు విశ్రాంతినిచ్చిన మీరు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులగుదురుగా...అది మిక్కిలి ఆనందదాయకము మాస్టారూ..Get well soon sir._/\_

  ప్రత్యుత్తరంతొలగించు
 6. good morning
  its a nice information blog
  The one and the only news website portal INS Media.
  please visit our website for more news updates..
  https://www.ins.media/

  ప్రత్యుత్తరంతొలగించు