ముగ్గులో చిత్రించు ముదితలార !
ఆనాటి గోపికా మీనాక్షులాయేమి ?
కమలాక్షు కండ్లకు కట్టినారు
ముగ్ధ మోహనరూపు ముద్దుగారెడు , చూడ
కనుగవ చాలదు కాంతలార !
రూప లావణ్యాలు రూపించి చిత్రించి
రమణీయతలకు హారతి పడితిరి
అతి మనోహరమైన యీ ప్రతిమ జూచి ,
కన్ను లానంద పరవశ గతిని జేరి ,
భాష్పములు గ్రమ్మె , తపమన్న భాగ్యమన్న
తమదె , యేరీతి వొగుడుదు ? తరుణులార !
తమిళ తరుణులు చాలా అందంగా ఓపికగా తీర్చిదిద్దారే. ముగ్గు చాలా బాగుంది 👏.
రిప్లయితొలగించండిఅవును మాస్టారూ పోయినవారంలో మీకు కంటాపరేషన్ అని మిత్రులు బండిరావు గారు ఫోన్లో చెప్పారే 🤔. మరి అప్పుడే మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? కంటికి పుష్కలంగా విశ్రాంతినివ్వండి. త్వరగా కోలుకోవడానికి నా బెస్ట్ విషెస్ 🌹🌼🍎🍎🥕🥕..
ధన్యవాదాలు సర్ , తమ ఆప్యాయతతో కూడిన అభిమానానికి .
తొలగించండిప్రస్తుతం బాగుంది .తమ సలహా అవశ్యం ఆచరణీయం .
రిప్లయితొలగించండితమిళ తరుణీ మణులట
న్నమితముగా పేర్మి గ యవనారిన్ చిత్రిం
చి మధురముగా గొలిచిరే
మమత సమతల నెలవు వనమాలి జిలేబీ !
జిలేబి
తల్లీ కొడుకుల చిత్రం
తొలగించండిబుల్లము వశపరచు కొనుచు నున్నది కృష్ణుం
డొల్లంత శ్యామ వర్ణము
తల్లి యశోద తెలుపు మిళితమయి వెలార్చన్ .
కంప్యూటర్ వాడుతూనే ఉన్నట్లున్నారు, బ్లాగులో వ్రాస్తూనే ఉన్నట్లున్నారు (ఈ టపాలోను, వేరే టపాల్లోనూ). మాట వినని విద్యార్ధులుంటారని తెలుసు, మాట వినని టీచర్లు కూడా ఉంటారన్నమాట.
రిప్లయితొలగించండికాబట్టి, ఆపరేషన్ నుండి కోలుకుంటున్న ఈ సమయంలో మీ ఆలనాపాలనా చూస్తున్నవారితో మీ దగ్గర్నుంచి కంప్యూటర్ / లేప్టాప్ / ఐపాడ్ / స్మార్ట్ ఫోన్ తీసేసుకుని ఓ వారం పదిరోజుల పాటు దాచి పెట్టెయ్యమని చెబుదామనుకుంటున్నాను. దయచేసి వారి ఫోన్ నెంబర్ ఇస్తారా మాస్టారూ?
సార్ , నరసింహరావుగారూ , ఇక పదిరోజులు కనపడనండీ ,
తొలగించండిమీరు మరీను , స్కూల్లో కొట్టి... ఇంటిలోనూ కొట్టిద్దామనే ...
ధన్యవాదములు , కృతజ్ఞతలు .
తొలగించండిసారూ సింహం వలె బ
డ్డారే వెనుక! కనబడను రా నా సామే !
వారగ బోయెద కొట్టిం
చే రావడి వలదయా !కచేరియు వలదోయ్ :)
ఇది భేషైన మాట మాస్టారూ 👌.
రిప్లయితొలగించండికళ్ళు మూసుకుని చక్కగా విశ్రాంతి తీసుకోండి. బ్టాగులే కాదు, టీవీ కూడా చూడకండి. అంతగా తోచట్లేదనిపిస్తే మీ వాళ్ళనెవరినైనా చదివి వినిపించమనండి. చేయించుకున్న చికిత్స యొక్క ఫలం పూర్తిగా దక్కించుకునే ప్రయత్నం మనమే చేసుకోవాలి కదా.
Wish you speedy recovery 👍.
(ఇంక నా ఈ వ్యాఖ్యకి - ఎవరి వ్యాఖ్యలకీ కూడా - జవాబు కూడా ప్రస్తుతం టైప్ చెయ్యకండి. తరవాత చూసుకోవచ్చు.)
మీ పోస్ట్ చదివిన మాకన్నులు ఆనందించెను...కానీ మీ కనులకు విశ్రాంతినిచ్చిన మీరు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులగుదురుగా...అది మిక్కిలి ఆనందదాయకము మాస్టారూ..Get well soon sir._/\_
రిప్లయితొలగించండి