సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జూన్ 2018, మంగళవారం

పుట్టిన రోజిదియని .....(జూన్ 5 నాజన్మదినం)

ఎందుకు జనించితినొ స్వామి ! యెవ్వియును ఘ
నతలు లేవు , కనీసము వెతలు లేని
బతుకు బతికితినా యన్న  - వెతుక నట్టి
బాట సుతరాము కనరాదు  భాగ్య ధాత !

పుట్టినరో జిదియని యి
ప్పట్టున క్యాలండరు నను పదె పదె గాసిం
బెట్టుచు హసించె , స్వామీ !
పుట్టువునకు సార్థకత్వ పూర్ణత లేమిన్ .

ఒజ్జదన మొక కొంత మేలుజ్జగించి
కాస్త యూరట దొరికెను కమల నయన !
మండు టెండన బడి వచ్చు మనిషి కొకట
చల్ల దొరికిన వడువున జలజనాభ !

ఎంద రీ భూమి బుట్టి సాధించిరి , పురు
షార్థములు , సంశయమె , యైన , నంద రిటువ
లె వగతుర ? సందియమె స్వామి ! , చివరిమజిలి
యైన భయద రహితమై శాయంగ రాద !

అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
కడవ బెట్టంగ నావయై గానుపించు
జరను రుజలను దాటంగ , పరమ పురుష !9 వ్యాఖ్యలు:

 1. ప్రతి ప్రాణి పుట్టుకకు ఏదో ప్రయోజనం తప్పక ఉంటుంది కదా మాస్టారూ. కాబట్టి పుట్టినరోజును ఆనందంగా చేసుకోండి 👍.
  జన్మదిన శుభాకాంక్షలు 💐.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా ఆలస్యంగా చూసాను మన్నించండి. _/\_
  మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
  అతి ఆలస్యంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు