ఎందుకు జనించితినొ స్వామి ! యెవ్వియును ఘ
నతలు లేవు , కనీసము వెతలు లేని
బతుకు బతికితినా యన్న - వెతుక నట్టి
బాట సుతరాము కనరాదు భాగ్య ధాత !
పుట్టినరో జిదియని యి
ప్పట్టున క్యాలండరు నను పదె పదె గాసిం
బెట్టుచు హసించె , స్వామీ !
పుట్టువునకు సార్థకత్వ పూర్ణత లేమిన్ .
ఒజ్జదన మొక కొంత మేలుజ్జగించి
కాస్త యూరట దొరికెను కమల నయన !
మండు టెండన బడి వచ్చు మనిషి కొకట
చల్ల దొరికిన వడువున జలజనాభ !
ఎంద రీ భూమి బుట్టి సాధించిరి , పురు
షార్థములు , సంశయమె , యైన , నంద రిటువ
లె వగతుర ? సందియమె స్వామి ! , చివరిమజిలి
యైన భయద రహితమై శాయంగ రాద !
అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
కడవ బెట్టంగ నావయై గానుపించు
జరను రుజలను దాటంగ , పరమ పురుష !
ప్రతి ప్రాణి పుట్టుకకు ఏదో ప్రయోజనం తప్పక ఉంటుంది కదా మాస్టారూ. కాబట్టి పుట్టినరోజును ఆనందంగా చేసుకోండి 👍.
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు 💐.
Thank you sir ,
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు 💐
రిప్లయితొలగించండిThank you Madam ,
తొలగించండి__/\__ ...
రిప్లయితొలగించండి__/\__ __/\__ __/\__
తొలగించండిచాలా ఆలస్యంగా చూసాను మన్నించండి. _/\_
రిప్లయితొలగించండిమీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
అతి ఆలస్యంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Thank you Madam ,
రిప్లయితొలగించండి