సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, జూన్ 2018, బుధవారం

' సంఘటితం కండి '


తెలగలు , వొంటరుల్ , బలిజ ధీరులు , కాపులు తెల్గు నేలపై
గలరు విశేష సంఖ్యల , సకాలములో తమ శక్తి జూపి , ఈ
మలినపు రాజకీయమును మట్టున బెట్ట మహోగ్ర మూర్తులై
తెలుగు ధరాతలమ్ము నినదింపగ సంఘటితమ్ము కావలెన్ .

ఇతరుల కాళ్ళవద్ద యసలేల పడుండగ ? , రోష శౌర్య సం
వృతమతులై , స్వయం జ్వలిత వేగ సుసంఘటి తాంతరాత్మతా
స్తుతిమతులై , వినూత్న గతి , వంచకులన్ దిగద్రొబ్బి , భ్రాతలై
సతతము రాష్ట్ర పాలనకు సందడి సేయుడు రాజ్యకాంక్షతో .

ఇదె సమయమ్ము - కాపు విజయేందిర ఆంధ్రప్రదేశ రాష్ట్రమం
దుదయము నొందు దాక , పునరున్నతి బొందెడు దాక , కృష్ణరా
య ధరణి నాధు ప్రాభవ మహా మహనీయత లొప్పు దాక ,  సం
విధ సముదైక్య సంఘటిత వేదిక గావలె కాపు వర్గముల్ .



4 కామెంట్‌లు:

  1. అదే సరైన మార్గం అనిపిస్తోంద☝️.

    నేల విడిచి నింగి నేలగా కోరికల్
    చాల గలవు , గాని , తేలి పోయి
    చుక్కల గమి నడుమ చుక్కగా భాసిల్ల
    కలలు గనుట గాక , వలను పడున ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును .....
      కాకలు దీరిన కాపులు
      తోకలు పట్టంగనేల ? తొల్లింటి మహా
      భీకర పోరాట పటిమ
      శ్రీకరముగ గలదు పోరు చేయండొకటై .

      స్థిరముగ ఇరవై శాతము
      వరముగ వోటర్లు కాపు వర్గము నందున్
      వెరసి గలరు పోరు సలుప
      కరములు కలపండి కాపు కధికారముకై .

      ఐనా ,
      నాపద్యం నాకే అప్పజెప్పారే .
      ధన్యవాదములండీ .

      తొలగించండి
  2. సొంతంగా పద్యాలు వ్రాయడం రాదు కదండీ...చదివినవి ఇలా వాడేసుకుంటానన్నమాట !
    పవన్ కళ్యాణ్ మీద మీకు ఆశలున్నాయా ?

    రిప్లయితొలగించండి