సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, ఆగస్టు 2018, బుధవారం

నా తెలుగు భాష ఆచంద్రార్కం వర్థిల్లు గాక !


చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                    *********
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                    ***********
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                        *************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .

8 కామెంట్‌లు:


  1. ‘స్సుప్పర్’ గా చ్చెప్పారండి. రియల్లీ. చదివుతుంటే ఒక ‘యమ్మీ’ డిష్ ఎంజాయ్ చ్చేస్సినట్లుంది. మీరు బ్లాగ్ డెయిలీ రాస్తే మేమంతా ఇంకా ‘హప్పీ’గా ఫీలవుతాం కదా. ‘అస్సలు’ మీరు ఇలాంటి ‘అమేజింగ్’ బ్లాగ్ ‘కంటెంట్’ తయారుచ్చేసే ‘ప్రోసెస్’ ఏమిటో చ్చెప్పండి ప్లీజ్ ప్లీజ్. మాగ్జిమం నెక్స్ట్ ఫ్రైడే లోగా చ్చెప్తారా ప్లీజ్. దీని మీద ‘అప్డేట్స్’ నా నెంబర్ కి మెసేజ్ చ్చెయ్యండి.
    =============
    మాస్టారూ తెలుగుభాష యొక్క ఈ నాటి దుస్ధితి చూస్తుంటే ఇది ... మన దేశంలో మటుకు ... త్వరలో భూస్ధాపితం అయిపోయే భాషేమో అని నాకు దిగులుగా ఉంటుంది (విదేశాలలోని మన వారు తెలుగుభాష కోసం బాగానే తాపత్రయపడుతున్నట్లున్నారు లెండి) . ఎక్కువలో ఎక్కువ మరో ఏభై అరవై సంవత్సరాలలో ... ఒకవేళ మృతభాష అవకపోతే ... ఏదో సంచారతెగ కి చెందిన భాష అన్నట్లు మాత్రం బతికుంటుందేమోనని నా భయం (‘జీవచ్ఛవం’ అనే మాట అనడం నాకిష్టం లేదు). అయితే ఇంకా అంతకాలం అన్నేళ్ళు ఉండబోనుగా చూడడానికి అని ఊరట కలిగించే ఒక ఆలోచన. మీరేమో ఆచంద్రార్కం అంటున్నారు, మంచిదే. అలా వర్థిల్లాలనే నా కోరిక కూడా, వర్థిల్లితే మహదానందపడేవారిలో నేనూ ఒకడిని. కానీ ఒక మూల ఏదో తెలియని సంశయం 🙁.
    ==============
    పై నాలుగు మాటలతో నేను ... ‘సైనింగ్ ఆఫ్’, బైబై, సీ యూ టుమారో 😀😀 (ఇవి కూడా తెలుగు టీవీ ఛానెల్స్ లో తరచూ వినిపించే మాటలేనండి).

    రిప్లయితొలగించండి

  2. బుచికో బుచికి ఏంది బయ్యా తెగ పరేసానయిపోతరు ?

    రిప్లయితొలగించండి
  3. సరస్వతీదేవి పటం చాలా బాగుంది.
    సర్వశ్వేతా సరస్వతీ అన్నారు.
    అందుకు అనుగుణంగా చిత్రించారెవ్వరో కాని.

    ఉ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
    హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
    దార సుధాపయోధి సిత తామరసామర వాహినీ శుభా
    కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!

    అన్న మనపోతన్న పధ్యం స్ఫురించింది వెంటనే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే , అమ్మరూపాన్ని అన్వర్థంగా చిత్రించారు . పోతన శారదాస్తుతి ఆమోఘం . స్ఫురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు .నేను కూర్చిన పద్యం .....


      నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
      వాగ్దేవి ! శారదా ! వందనములు ,
      తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
      బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
      బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
      పరదేవతా ! నీకు వందనములు ,
      పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
      పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

      జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
      వర సరస్వతీ మాతరో ! వందనములు ,
      ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
      వరలు మూలపుటమ్మరో ! వందనములు .


      తొలగించండి