సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, అక్టోబర్ 2018, శనివారం

బ్లాగ్ వీక్షకులకూ , మిత్రులకూ దశరా శుభాకాంక్షలు


వందనాలు తల్లీ .....
-------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి  తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .

తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

4 కామెంట్‌లు:



  1. ఎవ్వార లెవ్వరలకో
    కవ్వము ద్రిప్పుచు నవనిని కదలిక నిడు వా
    రెవ్వారకో! జిలేబీ
    లవ్వాడ తెలియతరమగు?లపితంబంతే !


    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నీహారిక గా రీమథ్య పలకరించడంలేదు .
    అందుకే ,శరన్నవరాత్రి శుభాకాంక్షలతో
    వారికొక పద్యం .....
    విషయ మేదైనను విఙ్ఞత కలిమి తా
    నవగాహన మొనర్చు నందరకును
    ఆంధ్రాంగ్ల సాహిత్య మందు వైదుష్యము
    గడు విశేషము గాగ కలదు తనకు
    వాదనా పటిమతో పాల్గొని చర్చలో
    సునిశిత వాగ్ఝరుల్ చూపు చుండు
    బ్లాగులు చదివి తద్రచనపై నిక్కచ్చి
    గా నభిప్రాయమ్ము కరము దెలుపు

    మాకు చెల్లెలు , మాపయి మహిత సోద
    రానుబంధమ్ము గలదు నీహారికకు , క
    డగి శుభాకాంక్ష లందింతు , నొగి శరన్న
    వ శుభ రాత్రి జగన్మాత వరము గలుగ .








    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పదిరోజులూ మీనుండి పద్యాలు వస్తాయి అని రోజూ చూస్తూ ఉన్నానండీ.కమెంట్ వ్రాయడానికి ఒక్కోసారి బద్దకం.టైటిల్ లో దశరా అని వ్రాసారు.శ్యామలీయం గారు చూస్తే బెత్తం పట్టుకొస్తారేమో ? దసరా కదా ?
      మీ పద్య వ్యాఖ్య కు బోలెడు ధన్యవాదాలు !

      తొలగించండి
    2. విజయదశమితో కలిపి దశరా పది రోజులు .
      పది రాత్రుల పండుగ అనే అర్థంలో
      దశరా అనే పేరే కరక్ట్ .
      నేను మహా మొండి , ఎవరు చెప్పినా
      వినేరకం కాదు .
      ఇక శరత్ కాలంలో అమ్మణ్ణికి తొమ్మిది రోజులు
      ఒక్కో రోజు ఒక్కో మూర్తిగా అలంకరించి
      పూజించడం వల్ల ఈ పండుగను దేవీ
      శరన్నవరాత్రు లంటారు .
      మీ పలకరింపుకు ఆనందంతో కూడిన
      ధన్యవాదాలు .

      తొలగించండి