సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, అక్టోబర్ 2018, శనివారం

నా పద్యం సొగసు లీని , గుభాలిస్తోంది


' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .

మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీర వొగుడుదుము తలలు వంచి .

ఎంత రమణీయ మీ పూల పుంత !  మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల బెంచి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు తీర్చినారు .

కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .

కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !

తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు  రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !

14 కామెంట్‌లు:

  1. గురువు గారూ,
    నిజంగానే మీ పద్యం ఆ గులాబీ లానే సొగసు లీని,
    గుభాలిస్తోంది ...
    నాలాంటి చిరు వ్రాయసగాళ్ళకు సదా మీరిచ్చే
    ప్రోత్సాహం, మెచ్చికోలు కు శిరసా వందనం ...
    __/\__ ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువింద లెంద రెందరొ
      గురుదేవుల వేష మేసి గొప్ప నటనతో
      ఖర భాషా కోవిదులై
      తరలి తెలుగు భాష పారుదలను గ్రసింతుర్ .

      తొలగించండి


  2. వత్తురు రాయిని వేతురు
    గుత్తగ తమ సొంతమువలె కూరుచు తప్పుల్
    విత్తమిది యందరిది మన
    సొత్తు మరువకు మరువకు సుశోభిల తెలుగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పు లెన్నువారు తండోప తండంబు
      ఉర్వి , జనుల కెల్ల నుండు తప్పు
      చెప్పు దినెడి కుక్క చెఱకు తీ పెరుగునా
      విశ్వదాభి రామ వినుర వేమ !

      తొలగించండి


    2. ఎక్కడ ఎవరు ఎవరిని ఏమన్నారో మాకు తెలియకుండా పోయిందే.
      అయ్యయ్యో! :)


      జిలేబి

      తొలగించండి
  3. సొత్తును భోషాణములో ,
    తిత్తులతో దాచి , కట్టు దిట్టపు తాళాల్
    గుత్తులు భిగించి దాచుడు ,
    పొత్తమ్ములు పనికి రాక పోవు మహాత్మా !





    రిప్లయితొలగించండి
  4. YVR గారి బ్లాగ్‌లో మీ వ్యాఖ్య చూశాను.

    "బలిజను నేను , పుట్టువున పావని గంగకు తమ్ముడన్ , మహా
    బలితలకెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుండ , స్వ
    స్థలమది కుల్లురీ పురము , సంపదలందున విద్యలందు భూ
    తలమున సాటిలేని ఘనతల్ గల యూరిని బుట్టితిన్ కడున్ .

    ఎంత సొగసైన పదాలతో, ఇంకెంతో ఉదాత్తమైన భావంతో, స్వాభిమానంతో మీరెవరో ఎంత చక్కగా చెప్పారో, మాష్టారూ! మీకు ప్రణామాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి ప్రణామాలు , మరియు ధన్యవాదాలు .

      మీ స్వచ్చమైన మనస్సు చిలికించిన పలుకుల మంచు బిందువుల
      తాకిడి ఆహ్లాదాన్నిచ్చింది .
      ఐనా ,
      కథనమున బాల్యపు స్మృతులు గాని , బంధు ,
      హితుల గూర్చి గాని , మామూలు కతలు గూడ
      మాటల మనోఙ్ఞతలు కూర్చి మాయ జేయు
      లలిత లలితోక్త చాతురి రాదెవరికి .

      తొలగించండి


    2. లలిత లలితోక్త చాతురి
      సలిలంపు ప్రవాహమై ప్రసంగించు భళా
      కలగలుపుమాటల,జిలే
      బులతో త్వామనురజామి పులకిత రమణీ :)


      జాల్రా
      జిలేబి :)

      తొలగించండి
    3. పెర వార లైతి మకటా !
      చొరకుము నా బ్లాగటన్న చొప్పు దలిర్పన్
      తిరునామము దీసిరి , నా
      చిరు వ్యాఖ్య దొలంగ ద్రోచి , చిత్తము ! విదుషా !

      తొలగించండి

    4. విముక్తి పొందెను :)


      అరె! లక్కాకుల వర్యా!
      పెరవారలెటు లగుదురయ ! పేర్మికి మీరౌ
      తరమగు పెద్దాసానులు
      సరసపు మీచిరు జిలేబి స్పామున పోయెన్ :)


      జిలేబి

      తొలగించండి
    5. పొగబెట్టి పంపె నొక్కడు ,
      పొగరెక్కి యహంకరించి పొమ్మనె నొకడున్ ,
      జగమెరిగిన వాణ్ణి , మదిని
      సెగలకు తావియ్యబోను , చిత్తము ! విహితా

      తొలగించండి
  5. తా నొచ్చెనో మరి మరి తానొచ్చునో
    తానొకపరి జెప్పునో మరి 'లే నే జెప్పనో'
    తా నొ(ని)ప్పక మరి నా మది నొచ్చునో
    తా నించుక తాకక మరి నా పాటెటు విచ్చునో ...

    రిప్లయితొలగించండి