సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

30, అక్టోబర్ 2018, మంగళవారం

ఆహ్వానం


వీక్షకులు ,
మిత్రులు ,
మరియు యావత్
బ్లాగు లోకానికీ
ఆహ్వానం
*****

మా కుల్లూరు శివాలయంలో
ఈ నవంబరు 19
కార్తీక సోమవారం
మహా రుద్రాభిషేకం
రుద్రయాగం
కార్తీక వనభోజనాలు
శివ పంచాక్షరీ మంత్రజపం
ప్రవచనాలు
కార్తీక దీపోత్సవం
సాంస్కృతిక కార్యక్రమాలు
నాచే నిర్వహించబడును
రండి , ఒకరోజు పరమేశ్వర
సన్నిధిలో ఆనందంగా
గడుపుదాం .

20 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు సార్ ,
      బ్లాగు మిత్రుల కందరకూ ఆహ్వానం
      పెట్టేను . నాచే నిర్వహింపబడే ఈ
      దైవ కార్యానికి మద్దతు ప్రకటిస్తారని
      ఆశిస్తున్నాను .

      తొలగించండి
  2. గురువు గారూ,
    మీరు తలపెట్టిన ఈ దైవ కార్యం శుభప్రదంగా,
    దిగ్విజయప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా
    కోరుకుంటున్నాను - దైవాన్ని వేడుకుంటున్నాను.
    మీ సహృదయ, నిస్వార్ధ సేవాభావాన్ని యెంత
    పొగిడినా తక్కువే సర్ ... __/\__ ...
    మీ ఆదర పూర్వక ఆహ్వానానికి కృతజ్ఞతలు ...

    రిప్లయితొలగించండి
  3. సార్ ,
    ధన్యవాదాలు ,
    మా ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నా రను కుంటున్నాను .
    మిత్రులందరమూ ఈ నెపంగానైనా
    ఒక వేదిక మీద కలుద్దాం , పరమేశ్వరుని సన్నిధిలో
    ఒక రోజు ఆనందంగా గడుపుదాం .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలవాలన్న కోరిక దృఢంగానే ఉంది సర్.
      తప్పకుండా ప్రయత్నిస్తాను.
      ఆపై దైవేచ్ఛ.

      తొలగించండి


  4. వచ్చెదమండీ కుల్లూ
    రొచ్చెద మండి కవిరాట్! పరుగు పరుగులనన్
    విచ్చగనిక మిత్రత్వం
    బచ్చట నధికంబుగాంచు పరిచయములహో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. వచ్చెదరు గద ? నిఝంగా !
    వచ్చెద రొచ్చెద రగునగు , వచ్చెద మని మా
    టిచ్చిరి , హిత మహితులు గద ,
    ఇచ్చిన మాట కొడబడుటయే ఘన మనఘా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జిలేబి ప్రచ్ఛన్నంగా రావాలంటే జాంగ్రిలా_ కామోసు‌ :)


      జిలేబి

      తొలగించండి
    2. ఏదైనా స్వీటే గద !
      మోదము గద రసన మీద ముమ్మాటికినీ ,
      కాదన కనేక మథుర త
      రోదనములు తెండు మిత్రు లోలి భుజింపన్ .

      తొలగించండి
  6. మీరు తలపెట్టిన శ్లాఘనీయమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మాస్టారూ. వచ్చేందుకు ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్ ,
      నమ:పూర్వక ధన్యవాదాలు ,
      తప్పక తమ పర్యవేక్షణలో
      దైవకార్యం జరిపించండి .

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. ఈ దైవ కార్యంలో పాల్గొని మా సోదరిగా
      మీరు మన ఈ కార్యక్రమాన్ని అజమాయిషీ
      చెయ్యాలి .ధన్యవాదాలు .

      తొలగించండి
    2. కుల్లూరు రావాలంటే అమ్మవారికి మామీద దయకలగాలి కదా ? అనుకుంటే రాలేమండీ....ఆవిడ రమ్మంటేనే రాగలం ! తిరుమల వరకూ వెళ్ళి దర్శనం లేకుండానే తిరిగివచ్చేసాను.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  8. చింతలన్నియు ద్రోసి శివుని సన్నిధి చేరి
    సుంతసమయము గడుప జూడరే మీరు

    సోమవారమునాడు సోముని దేవళము
    ప్రేమతో దరిసించి విభునిసేవించి
    కామారికథలును నామజపంబులును
    మీ మనసుతీరగ మిగుల భావించరే

    విధివిష్ణుశక్రసేవితమైన తత్త్వమును
    బుధులార గుమిగూడి పొగడగా త్రిజగ
    దధినాథుడైన హరు డానందముగ మీకు
    మధురమౌ దీవనలు మరిమరి కురియగ

    రామచంద్రార్చితుని రామభక్తులు మీరు
    నీమంబుతో చేరి నిలిచిసేవించి
    కామాది సర్వవికారంబులను గెల్చి
    మోమాటమే లేక ముక్తినిధి గొనరే

    (శ్రీరామసంకీర్తనం 452వ కీర్తన)

    రిప్లయితొలగించండి
  9. శ్యామలరావు గారూ ,
    మనోఙ్ఞమైన శ్రీరామ సంకీర్తనంతో
    ఆశీస్సులందించారు , ధన్యవాదాలు .
    రామచంద్రునికి అత్యంత ప్రియమైన
    కార్యక్రమమిది , మీరూ వస్తున్నారు .
    ఆ రామచంద్రులూ వస్తున్నారు .
    అందుకే ....

    రామచంద్రార్చితు దరికి , రఘు విభుండు
    వచ్చి , యభిషేక తదితర ప్రముఖ విధుల
    తానొనర నిర్వహించుట తనకు ప్రియము ,
    కోరి బిలిపింతు ధరణజ గూడి రాగ .

    రిప్లయితొలగించండి
  10. మాస్టారుగారు,
    మంచి మనస్సుతో, భక్తిత్వంతో మీరు నిర్వహించే దైవకార్యం శ్లాఘనీయం. చక్కటి మీ సంకల్పం శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  11. భారతి గారూ ,
    ధన్యవాద పురస్సర నమోవాకములు ,
    తమకూ ఇందు ముఖంగా ఆహ్వానమే .
    తమ ఆకాంక్ష నాకు బలం చేకూర్చింది .

    రిప్లయితొలగించండి