సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, డిసెంబర్ 2018, శనివారం

వృక్షో రక్షతి ....
వృక్షో రక్షతి ......
--------------
బ్రతు టెన్నాళ్లొ తెలియదు , బ్రతుకు వంద
లాది యేళ్లు వృక్షాలు , ఫలాల నీడ
ల నొసగుచు , నాటిన సుజనుల బ్రతికించి ,
మేలు చేసిన వారికి మేలు సేయు .

 అమ్మవార్ల గుడుల కటుప్రక్క నిటు ప్రక్క
రెండు నూర్ల మ్రొక్క లిరవు గాగ
నాటి పెంచినాను , నయనారవిందాలు
విచ్చు కొనును , చూచు సచ్చరితుల .

వేప కానుగ నేరేడు వెలగ జామ
నిమ్మ  మామిడి యరటి దానిమ్మ  మొదలు
గాగ వృక్షజాతులు , ననేక సుమ తరులు
నాదు జన్మ ధన్యత నొందె నని దలంతు .

2 వ్యాఖ్యలు:

 1. మీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు సామాన్యమైనవి కావు మాస్టారూ 👌.
  రిటైర్మెంట్ జీవితాన్ని మీరు గడుపుతున్న విధానం శ్లాఘనీయం 👏.
  మీ ప్రాంతం ఎక్కువగా ఎఱ్ఱమట్టి నేలలా కనిపిస్తోంది. కరక్టేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నరసింహరావు గారూ ,
  ధన్యవాదాలు .
  ధార్మిక , సామాజిక , దైవకార్యాలు
  చేయాలని మనసు ఆరాట పడుతోంది ,
  జీవితం ముగింపు దశలో కొచ్చింది కదా ,
  ముగిసే లోపు - దేహం సహకరించే వరకు ,
  సంతోషంగా గడపాలని .....
  అదంతా పోత మట్టి , నిజానికి అక్కడంతా
  నల్లమట్టి .

  ప్రత్యుత్తరంతొలగించు