నుదుటిపై ముడతలు పొదువు కొనును
కనుచూపు తగ్గును కన్నెడ పైకొను
చెక్కుటద్దమ్ములు చెలువు దప్పు
కాళ్లును సేతులు కీళులు సడలును
నడుము డస్సి నాణ్యము నశించు
ఉదరమ్ము పదపడి యుబ్బి చరించును
తిన్న దరుగని జబ్బు తీవ్రమగును
తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
మనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము ,
ఏ వయస్సున ముచ్చటల్ ఆవయసువి ,
సర్దుకుని మనుటె ఘనము , శాంతి యుతము .
తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
రిప్లయితొలగించండిమనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము
తప్పదు తప్పదు! మార్పు తప్పదు.
ఇదియే నిజమని తెలిసీ కాదనుకునియేము.
తొలగించండికష్టే ఫలే వారిలో మార్పు నిజమైనట్టుంది :)
ఈ మధ్య పద్య వ్యాఖ్యలతో కలక్కిఫైయింగ్ :)
జిలేబి