సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

తలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు




నిలిచి బ్రంహ్మాండ మంతయు నిండి యున్న
ముగురు తల్లుల శక్తికి మూల మీమె
ఎల్ల లోకములకు తల్లి యీమె యనుచు
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు

వేద విహిత విధి విధాన విరచిత శిఖి
శిఖల జ్వాజ్వల్యమాన రోచిషుల నడుమ
మహిత యాగాగ్ని గుండ సంభవ యగుటను
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

రక్త సింధూర వర్ణంపు  రామణీయ
క , లలిత , మనోఙ్ఞ రూపము  , కనక ఖచిత
మణిమయ కిరీటమున ,  అమ్మ విభవమ్ము
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

పసుపు కుంకుమల  , సుగంధ పరిమళముల
నెల్ల వేళల   మైపూత   లుల్లసిల్ల  ,
దీప ధూపాల తోడ సందీప్త యగుట
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

59 కామెంట్‌లు:

  1. జాతరలాంటిది ఏమైనా చేస్తారాండీ ?

    రిప్లయితొలగించండి
  2. నా బాల్యంలో చూశాను ,
    గత పదిహేనేళ్ళనుండీ ఈ ఆలయం ఆనుపానులు
    నేనే నిర్వహిస్తున్నాను . అటువైపుగా దృష్టి సారించడం లేదు .
    పరిసర అభివృద్ధి , మొక్కలు పెంచడం చేస్తున్నాను .
    దాతల నాశ్రయించడం గానీ , ఇతరుల పైకాన్ని ఖర్చు చేయడం
    గానీ నాకు మనస్కరించదు . నేను నిర్వహించే కార్యక్రమాన్ని
    ఇతరులు ( ఖర్చు వెచ్చాలకు సంబంధించి ) షేర్ చేసుకోవడాన్ని
    నేను అనుమతించను . ఇతరులు చేసే కార్యక్రమాలలో నేను
    దూరను . అడ్డు చెప్పను .
    జాతరలు గ్రామస్తు లందరూ కలిసి నిర్వహించే కార్యక్రమం కదా !
    ఐతే , అమ్మకు నిత్యం పూజాదికాలు నిర్వహిస్తూనే ఉంటారు .
    వివాహాది శుభకార్యాలూ , శిశు జననాలూ ఎక్కడ జరిగినా ఇక్కడకు వచ్చి
    అమ్మకు పెట్టుకోవడం తప్పనిసరి . కడకు నగా నట్రా కొత్తవి చేయించుకున్నా అమ్మకు మొదట అలంకరించి వాడుకోవడం ఆనవాయితీ .
    ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  3. జంతుబలులేమీ జరగవు కదా?

    దాతలను మీరంతటమీరు ఆశ్రయించనక్కరలేదు. కానీ గుడి / జాతరల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎవరైనా వదాన్యులు తమంతటతామే డబ్బు ఇస్తే తీసుకోవడంలో తప్పేమీ లేదేమో, ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  4. అమ్మవారి ఆలయాలలో వామాచారం పాటిస్తారు .
    ఇక , గుడికి అభివృద్ధికి సంబంధించి నేను చేయదలచుకున్నది చేస్తూనే ఉన్నాను . తమంతట తామిచ్చినా , మన్నింపు కోరుతాను . ఇతరుల
    డబ్బుతో ఏపనీ చెయ్యను . మంచో , చెడో ఈనియమాన్ని వదులుకో లేను . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  5. గుళ్ళల్లో పెట్టే పులిహోర ఇష్టమే కానీ ఫలానా కోరిక తీరితే ఫలానా కోడి/మేక మెడ తెగ్గొట్టే ఆచారం నాకు నచ్చదండీ. ఫలానా కోరిక తీరితే పాయసమో, పులిహారో వండిపెట్టే ఆచారాన్ని మాత్రమే పాటిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. పులిహోరల ,దధ్యోదన
    తలియలతోపాటు కోడి , తగరుల మాంసా
    లలవాటు మాకు తినుటకు ,
    పలలాశన మెంత రుచియొ భగవతి యెరుగున్ .

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. మీ నెల్లూరు అబ్బాయి పాడిన పద్యం వినండి.
    https://youtu.be/z_fmiW8h0To

    రిప్లయితొలగించండి
  9. సత్యహరిశ్చంద్ర లో తిరమై సంపదలెల్ల పద్యం , బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన , ప్రవీణ్ కుమార్ అదరగొట్టేశాడు . అతని తదితర ఎపిసోడ్లుకూడా
    విన్నాను . అద్భుతంగా పాడేడు . లింకిచ్చినందుకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  10. # నీహారిక గారు

    ఉన్నట్లుండి హరిశ్చంద్రుడి (కాటి) పద్యం వినిపించేటంత వైరాగ్యం ఎందుకు కలిగింది 🙁?

    ప్రవీణ్ కుమార్ చాలా బాగా పాడాడు 👏 - పద్యం చివర్లో జీళ్ళపాకం లాగా సా .. ా .. ా ... గే .. ే .. ే రాగంతో సహా 🙂. మా చిన్నతనంలో నాటక రంగ నటులు కొందరు తీసే రాగం పూర్తయ్యేసరికి దాదాపు తెల్లవారేది 😀 (jk 😀). అంత కాదు గానీ ... పద్యం కన్నా రాగం చాలా ఎక్కువసేపే ఉండేదన్నది నిజం. ఇప్పుడు దానితో సహా ప్రవీణుడు బాగా పాడాడు 👌. మంచి సాధన చేసినట్లున్నాడు.

    "నెల్లూరు అబ్బాయి" అంటే ఎస్.పి.బి. అనుకున్నాను. అయితే ఎస్.పి.బి. నిర్వహించిన ప్రోగ్రాములో పాడిన నెల్లూరబ్బాయన్నమాట. బాగుంది. అన్నట్లు ప్రవీణుడు నెల్లూరుకు చెందినవాడని మీకెలా తెలుసు? ఈ ప్రోగ్రాం Part-1 విడియో కూడా చూశాను కానీ అటువంటి పరిచయం కనబడలేదు. నేనేమన్నా మిస్సయ్యానా 🤔?

    రిప్లయితొలగించండి
  11. వైరాగ్యమా ? నాకా ? నెవర్...నో..ఇల్లే....నహీ !
    నాకెపుడు వైరాగ్యం సిద్ధిస్తుందా అని ఎదురుచూసేవాళ్ళున్నారు. నెల్లూరు అబ్బాయి అని యుట్యూబ్ లోనూ బాలసుబ్రహ్మణ్యంగారు కూడా ఆ సీరీస్ లోనే చెప్పారు. నేను పద్యాలు వ్రాస్తున్నానని అంటున్నారు కదా అని ఓ పద్యం పాడదామని ట్రై చేస్తున్నా శాంపిల్ గా ఇది చూపించా. బాగా ప్రాక్టీస్ చేసాక రాగం తీస్తా !

    రిప్లయితొలగించండి
  12. 🦁 గారూ,

    మా అబ్బాయి హిందీలో పాడిన పాట !
    http://yokee.tv/r/UQnUACHPj8

    రిప్లయితొలగించండి
  13. # నీహారిక గారు
    ముందుగా మీ అబ్బాయికు అభినందనలు. భవిష్యత్ కు శుభాకాంక్షలు.
    అతని ఈ పాట యూట్యూబ్ లో ఉందా? మీరిచ్చిన yokee ఏవిటో తికమకగా ఉంది, పాట ప్లే అవడం లేదు.
    🦁

    రిప్లయితొలగించండి
  14. Yokee is anapp...first download the app and listen to the song and uninstall the app.

    రిప్లయితొలగించండి
  15. విన్నానండి. కుర్రాడు బాగా పాడాడు. సంగీతం మంచి హాబీ 👌.

    హేవిటో, "యాపుల" ప్రపంచం అయిపోయింది 🙁.

    రిప్లయితొలగించండి
  16. నరసింహ విన్న కోటను
    కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
    త్కరి కరిభి ద్గిరిగిరిభి
    త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై

    (రామకృష్ణులకు క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు పాటలు కూడా వ్రాస్తారా ?

      "కంద పద్యాలు వ్రాసేటి జిగురు జిలేబీ
      నీ మెదడు క్రిందికి జారిందా చూడు జిలేబీ"
      స్టైల్ లో ఒక పాట వ్రాయండి.

      తొలగించండి
    2. జిలేబీ ముసుగులోని కవిపండితులు మనకు ఆత్మీయులుకదా !
      అయిష్టులను కూడా మాటతూలని మనస్తత్వం నాది .
      ఆత్మీయులను ఆటపట్టిస్తూ పాటగట్టడమా ? నెవ్వర్ .....
      ఐతే , పాటలు రాసే అలవాటుంది .

      తొలగించండి




    3. అరరె! జిలేబి ముసుగులో
      న రహస్యము లెల్ల తెలిసి నట్టి కవివరుల్
      పరమాప్తులై వెలిగిర
      మ్మరో కుదరదమ్మ పాట మారుగ రాయన్ :)


      జిలేబి

      తొలగించండి
  17. # రాజారావు మాస్టారు
    తెనాలి రామకృష్ణ కవి గారికి మీరు అవశ్యం క్షమాపణలు చెప్పుకోవలసినదే. లేకపోతే శ్రీకృష్ణదేవరాయలంతటి వారి నుద్దేశించి కవి గారు చెప్పిన రత్నం లాంటి పద్యాన్ని నావంటి సామాన్యుడికి అన్వయించడమేమిటి 😳? మీ అభిమానానికి కృతజ్ఞుడిని 🙏 కానీ ఆ ప్రశంసకు ఏమాత్రమూ తగినవాడను కాను, కాను అంతే ✋ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు సినీమా విలనీ వేస్తారని గ్రహించి ,
      ఒక లిరిక్ వ్రాయడానికి రికమెండ్ చేస్తారని
      అంతటి పద్యం నే రాయలేను గనుక ,
      కవికి క్షమాపణలు చెప్పి , కాపీ పేష్టు చేశా .
      ఆపై తమిష్టం .

      తొలగించండి
    2. భలేవారే, నన్ను నమ్ముకున్నారా? చూశారుగా, నేనే ఒక సినిమా నిరుద్యోగినయ్యాను 🙁. పద్యం వృథా అయిందే.
      ఏమైనా నా మీద మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు.

      తొలగించండి


    3. సినిమాలో మీరు విలను!
      రణంబగు లిరిక్సు నేను రాయంగనులే
      ను! నుతుల రాయల పదముల
      మనదైనట్టి చిరు పద్య మందారమిదే !

      జిలేబి

      తొలగించండి


    4. సినిమా లేవీ లేన
      ట్టి నిరుద్యోగినయ రాజ టీకొట్టే నా
      కనివార్యమికన్! నను న
      మ్మినావ! యేమందునయ్య మేష్టారయ్యా :)



      జిలేబి

      తొలగించండి
  18. # నీహారిక గారు
    మీరు ఒక చలనచిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నారని, విలన్ వేషం వేసేవారి కోసం చూస్తున్నారనీ తెలియవచ్చింది.

    సరైన విలన్ పాత్రధారిని నేనే. నవ్వడం / నవ్వుమొహం పెట్టడం నాకు అంత తేలికగా రాదు గానీ ... గంభీరంగా మొహం పెట్టడం, కోపంగా చూడడం మాత్రం మా బాగా వచ్చు (కొంతమంది సీరియస్ మొహం అంటారు. అయితే అటువంటి జనాలు నేనంటే గిట్టనివారు అని మీరు గ్రహించవలసిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది) 😬. కాబట్టి విలన్ వేషానికి బాగా సూటవుతాను 😎 .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. విలనుని వేషము నిమ్మా!
      లలనా!నీహారిక దయ! లసితపు ముఖమున్
      కలలో నైనన్ చూపం
      గలేను! గంభీరముగ పొగల గ్రక్కగలన్ :)


      తొలగించండి
    2. "# "జిలేబి" గారు
      మీ సిఫారసు కూడా పనిచెయ్యలేదు, చూ'షా'రా మరి. నిర్మాత గారి కొడుకుని మెచ్చుకున్నా లాభంలేకపోయింది. సినిమా వాళ్ళండీ సినిమా వాళ్ళు 🙁."

      తొలగించండి


    3. చూషారాండి ! సిఫారిసు
      ఆషాజనకముగ లేదు ఆనక యాషా
      మాషీయవ్వారము మీ
      పేషీఖత్తునకు కూడ వెసలిచ్చుటలే :)

      జిలేబి

      తొలగించండి
  19. విలన్ అంటే మజాకా ?

    బాహుబలిలో "రానా" అంత పవర్ ఫుల్ గా ఉండాలి. మీరసలే సౌమ్యావతారం. హీరో తో పోటీగా నటించాలి. అనుష్క శెట్టితో "చిత్రం భళారే చిత్రం" అంటూ డ్యూయెట్ కూడా పాడాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. విలనంటేను మజాకా?
      భళి రాణాలా యనుష్క ప్రక్కన డ్యూయెట్
      జలజల మాడేలా ఫైట్స్
      విలవిలలాడగ జనుల్ పవిదెగ గనవలెన్


      జిలేబి

      తొలగించండి
  20. # నీహారిక గారు (నిర్మాత గారు)

    అందుకే కోట శ్రీనివాసరావు గారు పదేపదే టీవీ ఇంటర్వ్యూలల్లో వాపోతుంటారు కదా ... ముంబయి నుండి, బీహార్ నుండి హిందీ విలన్లను తీసుకొస్తారు గానీ తెలుగువాళ్ళని ఆదరించరు ... అని. ఇప్పుడు మీరేమో అంత పొడుగున్న కుర్రవిలన్లే కావాలంటున్నారు. ఎత్తులో ఏముందండీ? మాలాంటి సీనియర్లు చేసే పోలిష్డ్ విలనీ ఎత్తులు వాళ్ళు వెయ్యగలరా? ఇక శెట్టి గారమ్మాయితో డ్యూయట్ చెయ్యడం అంటారా ... అది ఎప్పుడూ వెల్కమే. అయినా మీకు ఆనడం లేదు. ప్చ్. 🙁

    రిప్లయితొలగించండి
  21. పొడుగు హీరో కి పొట్టి విలన్ సూటవుతాడా? జనాలను భయపెడతారంటారా ? మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి పొట్టి హీరో ని వెతికితే సరిపోతుంది. ఈ లోపల జిలేబీ గారి పద్యాలు రాగాలు తీస్తూ పాడడం ప్రాక్టీస్ చేయండి మరి !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్మాత (దీనికి స్త్రీలింగం ఏమిటో 🤔?), దర్శకుడు(రాలు) చెప్పినట్లు చెయ్యాలనుకోండి. కానీ "జిలేబి గారి పద్యాలు రాగాలు తీస్తూ పాడడం ప్రాక్టీస్ చేయండి మరి !" అన్నారు చూశారా, అంటే మీ సినిమాలో ప్లేబాక్ పెట్టే ఆలోచన లేదా? మరీ పాతకాలపు సినిమాలల్లో లాగా నటీనటులు ఎవరి పాటలు, పద్యాలు వారే పాడుకోవాలా? వామ్మో 😳.

      తొలగించండి


    2. నిర్మాత కు స్త్రీలింగం మాత అండి

      నిర్ + మాత - మాతకానిది :) కాబట్టి నిర్ తీసేస్తే మాత
      స్త్రీలింగము :)


      జిలేబి

      తొలగించండి
  22. హ్హ హ్హ హ్హ, దేనికైనా సరే భాష్యం చెప్పడంలో మీకు మీరే సాటి :))

    రిప్లయితొలగించండి
  23. # నీహారిక గారు (నిర్మాత గారు)
    తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక సహాయం మాత్రం చేసి పెట్టండి ప్లీజ్. అదేమిటంటే :- (1). మీ చిత్రానికి పని చెయ్యబోయే ఛాయాగ్రాహకుడికి (కెమేరామన్) గాఠ్ఠిగా చెప్పండి ... క్లోజప్పులు తీసేటప్పుడు కెమేరాని మరీ నటుడి మొహంమీద ఆనించి పెట్టినట్లుగా పెట్టి ("వెరైటీ, డిఫరెంట్" అనుకుంటూ) ఆ నటుడి మొహం భూతంలాగా కనిపించేటట్లు గానూ, ఆ నటుడి ... ఇలా అంటున్నానని ఏమనుకోకండి ... ముక్కులో వెంట్రుకలు కూడా కనిపించేటంత దగ్గరగానూ ... క్లోజప్ తియ్యవద్దని. ఎంత సినిమా అభిమానులమయినా అటువంటి క్లోజప్పులను తెరపై చూడడానికి పరమ చిరాకుగా జుగుప్సగా ఉంటోంది, పైగా సినిమా వాళ్ళ పరిభాషలో చెప్పినట్లు ఆ క్లోజప్ ఏమీ "పండదు".

    (2). అలాగే హీరో గారు కారులోనుండి దిగుతున్నప్పుడూ, కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటున్నప్పుడూ ... హీరో గారి స్టైల్ అనుకుంటూ ... వారి పాదరక్షలు ప్రేక్షకుల మొహం మీద పెడుతున్నట్లుగా తియ్యద్దని కూడా కెమేరామన్ కు చెప్పండి. హీరో గారి స్టైల్ ప్రేక్షకులకు చాలా అవమానకరంగా ఉంటోంది.

    (క్లోజప్పుల సంగతి, పాదరక్షల సంగతి నేను సీరియస్ గా చెబుతున్న మాట, "జిలేబి" గారన్నట్లు "సరదాకని" కాదు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారూ, అటువంటి సీన్ల కోసమే సినిమా చూసే "అభిమానులు" ఉన్నారు. వాళ్ళు "తిక్కరేగి తిమ్మిరెక్కి" ఈలలు వేస్తూ & డబ్బులు విసిరేస్తూ ఎగబడి చూస్తారు. "ఆరేసుకుబోయి" మనసులు పర్సులు రెండూ పారేసుకుంటారు.

      అసలే సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే మీరు నిర్మాతలను ఇంకా ముంచే కుట్ర పన్నుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నయ్యం సూమోలు ఎగరెయ్యడం, తొడ కొట్టడాలు, డబుల్ మీనింగ్ డయలాగులు, కుర్రభామలతో ముసలి బండ హీరో తైతెక్కలు గట్రా మానేయమని చెప్పలేదు!

      jk

      తొలగించండి
    2. నేను చెప్పింది భూతపు క్లోజప్పులు, మన మొహాల మీద హీరో గారి పాదరక్షలు గురించి. అవీ ఆగవు, మీరు చెప్పినవీ ఆగవు లెండి. మాసే / ఫాన్లే దేవుళ్ళు అంటూ వెర్రి మొర్రి స్టైల్స్ చూపిస్తుంటారు. మాసే బాసూ మనల్ని ఈరోజు ఈ లెవెల్లో నిలబెట్టింది ... అంటూ ఏదో సినిమాలో మెగాస్టార్ గారి డైలాగొకటి ఉన్నట్లు గుర్తు. అంతగా బుర్రల్లోకి ఇంకిపోయిన ఐడియాలున్నప్పుడు మనలాంటి వాళ్ళం ఆనం కదా 🙂.

      తొలగించండి
    3. On a more serious note:

      నిజమేనండీ ఇవేవీ ఆగవు, ఇవి ఆగితే హీరోలకు మనుగడ ఉండదు. థియేటర్ వెళ్లకుండా ఇంట్లోనే కూచొని టీవీలో సినిమా చూస్తే బెస్ట్: చెత్తసీన్లు వచ్చినప్పుడు వేరే పనులు (ఉ. టీ తాగడం లేదా మిత్రులకు ఫోన్) చేయడం ద్వారా ఈ వెగటును అవాయిడ్ చేయవచ్చు.

      తొలగించండి
  24. నీహారిక ఎవరిమాటా వినదు. నా దారి రహదారి...

    https://youtu.be/Zid51bn5Xt4

    రిప్లయితొలగించండి
  25. తలచెద లలితా మాతగ ,
    తలచెద దుర్గాభవాని తల్లిగ , తగ నే
    దలచెద పరమేశ్వరిగా
    తలచెద మా యమ్మవార్ని తర తరములకున్ .

    కొలిచెద నమ్మి నిరంతర
    మలుపు మలుపు దరికి రాని మక్కువ కలుగన్
    కొలిచెద ననుగన్న మహో
    జ్జ్వలిత పరంజ్యోతిని తనివారగ తల్లిన్ .

    రిప్లయితొలగించండి
  26. కణ కణ మను నిప్పుల
    కణికలురలు పటు కటాక్ష గణము బరపి హుం
    ప్రణవాభీల భయంకర
    రణము సలిపి చెడును జీల్చు రమణీ తల్లీ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చీల్చగ వచ్చితి నిదిగో
      కాల్చెద నే పాకు సైనికాళిని! జనులే
      పిల్చిరి నను రమ్మనుచున్
      గొల్చుచు మేల్కొనుచు రేయి గూకుల రాజా‌ !


      జిలేబి

      తొలగించండి
  27. చీల్చగ వచ్చితి నిదిగో
    కాల్చెద నే పాకు సైనికాళిని!

    సైని 'కాళి' ని

    అయ్యో ,
    సైనికాళిలో కాళి కన్పిస్తుందండీ ,
    కాళి కాళిని కల్చేయడమేమిటి ?

    పెద్దనగారు కృష్ణరాయలపై పద్యం చెప్పి , అందు ఆయనశౌర్యం
    ముందు సింహం తోకముడిచి గుహలో దూరుతుందంటూనే రాజకంఠీరవా
    అని సంబోధించేడట ! రామకృష్ణులు దీన్నధిక్షేపించేడని ఐతిహ్యం .
    గుర్తుకొచ్చింది మీ పద్యం చూచి . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అదే కదా జిలేబీయమంటే :)

      కాల్చేదెవరు ? కాల్చబడే వారెవరు ?

      అంతా మాయ ! మహామాయ !


      ఇప్పుడెవరు ఎవర్ని కాల్చేసి కుప్పకూల్చేయాలని కుప్ప "కూల్ " చేయాలని ఆలోచిస్తున్నారు :)


      అంతా విష్ణుమాయ :)


      జిలేబి

      తొలగించండి
    2. "సైనికాళి" యా? సైనికావళి అనుండాలేమో కదా?
      అయినా మీకు తెలియదనా నేను చెప్పడం.

      తొలగించండి

    3. అవన్ని పండితులు తేల్చుకోవాల్సిన విషయం.
      హమే ఉస్ సే కుఛ్ లే నా దేనా నహీ హై :)


      జిలేబి

      తొలగించండి
    4. "తాంబోలాలిచ్చేశాను" అన్న రీతిలో చెప్పారు.

      తొలగించండి

  28. రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
    కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
    కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
    నెత్తుటి ధారలు నెగడు చుండ
    డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
    రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
    ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
    కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ

    దుర్నిరీక్ష్య తేజోమూర్తి దురితదూర
    దుర్గ మాయమ్మ కలదు ప్రాదుర్భవించి
    మమ్ము కాపాడు చున్న మా మాతృమూర్తి
    దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు

    రిప్లయితొలగించండి
  29. భూమి తత్త్వాత్మిక పోలేరుతల్లికి
    పసుపు కుంకుమ గంధ ప్రతతు లిడుదు
    ఆకాశ తత్త్వాన నలరు మా యమ్మకు
    నలరుల దండల నలర నిడుదు
    వాయు తత్త్వాత్మికై వరలు మా తల్లికి
    అగరు ధూపముతోడ హారతిడుదు
    వహ్ని తత్త్వముతోడ వసియించు మాతకు
    దేదీప్య సందీప్త దీప మిడుదు

    అమృత తత్త్వాన వెలుగు మా అమ్మవార్కి
    ప్రీతి పొంగళ్లు నైవేద్య మిడుదు
    సర్వ తత్త్వాత్మికై వెల్గు సకలజనని
    కొనర తాంబూల తదితర ప్రణతు లిడుదు .

    రిప్లయితొలగించండి
  30. బొటవ్రేల తర్జనిన్ బొలుపార గీలించి
    తక్కిన వ్రేళులు తగలనీక
    దక్షిణ హస్తాన తగ ఙ్ఞాన చిన్ముద్ర
    ధరియించి గురురూప హరుడు గాగ
    దక్షిణామూర్తియై తబిసి లోకానికి
    ఎరుక గల్గించు సర్వేశ్వరుడును ,
    నాగదోష నివారణార్థము మానసా
    దేవి వెలసిరి ప్రదీప్తమగుచు ,

    సర్వదోష నివారణా పర్వ మొనర
    రాహు కేతులు వెలసిరి , ప్రణతులిడుదు
    మా శివాలయమందున మమ్ము గాచ
    వచ్చి వెలసిన శివుడాది వరదులకును .

    రిప్లయితొలగించండి
  31. కోమల వల్లికా కుసుమ కుట్మల కుంజ మనోఙ్ఞ భూషితా
    రామ , శివా శివాని విహరాంగణ కేళి కళాభిరామ , భూ
    క్షేమ భరా వరా కృత విశేష మహత్వ సుకీర్తి ధామ ప్రా
    చీ మల మానసా సరసి శీర్షమ శ్రీకయిలాస గోత్రమా .

    రిప్లయితొలగించండి