సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, మే 2019, సోమవారం

మామిడి పండు


అందాని కతివలు కుందేరు నినుజూచి
రూపున పొంకమ్ము రోలు చుండ
రంగున కప్సరో రామలు నినుజూచి
యనిమిషులై వెర గందు చుండ
కొమ్మకు వ్రేలు నీ  కుల విలాసము జూచి
బొమ్మలై కొమ్మలు బొగులు చుండ
నిలువెల్ల రసమొల్కు చెలువంపు సిరి జూచి
సరసిజాననలు నీరస పడంగ

రసపిపాసు లింతుల యధరామృత రస
విరసులై ,తమ యధరముల్ వెలయ నీ ప
యిన లయింతురింక రసాల ఘన ఫలమ్మ !
మధుర ఫల మని యవనిపై మన గదమ్మ !

5 కామెంట్‌లు:

  1. ప్రకృతి వరం కదా 🙏.
    మీ తోటలోని చెట్టా మాస్టారూ 👌?

    రిప్లయితొలగించండి
  2. నిజమే సార్ ,
    పలుమారమ్మధురత్వముల్ నుతుల సంభావించవలసందే .
    ఆ గౌరవం ఇంకే ఫలానికీ కానము . పైగా , ఈ మధుర
    ఫలం ఊబకాయాన్ని సమర్ధంగా తగ్గిస్తుందని పరిశోధనలు
    చెబుతున్నవి .

    రిప్లయితొలగించండి
  3. కాయ/పండుగా వగరు, పులుపు, తీపిని; ఆవకాయ అవతారంలో కారం, ఉప్పు, చేదు(ఆవ), ఆరు రసాలని ఒలికించే మామిడికి ఇంకనుంచీ శృంగారరసం పలికించమని మాస్టారు అదనపు బాధ్యతలు అప్పగించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు YVR గారూ ,
      రసాలము రసాలవాలమే మరి .మామిడి పండు తింటే
      రసరాజం కూడా కరతలామలకమేనని పరిశోధనలు చెబుతున్నాయిట .

      తొలగించండి
    2. నిజమే అయ్యుంటుంది మాస్టారూ, 130కోట్ల జనాభా అంటే మాటలా మరి?(సరదాగా) ☺

      తొలగించండి