పరగ విశ్వ మనంతము , భ్రమణ రూప
చలన చాలన సంవృత్త శక్తి మయము
అందుగల కోట్ల గ్రహ తారకాది చయము
కడు నసంఖ్యాక మయ్యును కక్ష్య విడవు
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత
తాను నివ సించు విశ్వమే , తనకు సుంత
యైన బోధ పడుట లేదు , తాను శక్తి
మంతు డెట్లగు? విశ్వనియంత కన్న
నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు
‘భార్య బిడ్డలు తాను ‘ – ఈమాత్ర మైన
చిన్న సంసార బాధ్యతే చేత గాని
మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని
విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?
ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,
పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు
బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన
తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?
ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు
దాతనే మరచు కృతఘ్నతా విధాన
భావనలు గల్గు మానవా! పతన మవకు
భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము
రిప్లయితొలగించండికైమోడ్చి భక్తి, ప్రేమల
నీ మది లో నింపి తండ్రి నీవే దిక్కం
చూ మహితాత్ముని తోడుగ
నీమము తప్పక బతుకును నీడ్వు జిలేబీ !
జిలేబి
జిలేబి గారు, మీ పద్యం నాకర్థమైయింది. చాలా సూటిగా, చక్కగా కూడా ఉంది.
తొలగించండినీవే దిక్కని నమ్మిన
రిప్లయితొలగించండిఏ వొక్కరినీ విడడు మహేశ్వరుడు , సదా
కావంబూనును , దేవుని
సేవించుట మనుజ తతికి శ్రీకరము సదా .
మాస్టారు గారు, ఎవరిని ఆశ్రయిస్తే అన్ని భాగ్యాలు సమకూరుతాయి అన్నది చాలా చక్కగా, అర్థవంతంగా వ్రాసారు.
తొలగించండి