సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జూన్ 2019, మంగళవారం

ఇచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

పిడివాదమను రోగ పీడితుల్ కొందరు
సహనమ్ము కోల్పోయి సంచరింత్రు
జ్వలిత హింసానంద సైకోలు కొందరు
అఙ్ఞాన దుగ్ధతో యరచు చుంద్రు
పాండిత్య బురదలో పడి దొర్లు కొందరు
తప్పులెంచుటె తమ గొప్ప యంద్రు
చెత్త రాతల కొంగుశ్రీల భూషించుచు
కొందరు పరవశంబందు చుంద్రు

కూటముల్ గట్టి కొందరు కూడి మాడి
పూని తమలోన తారు మెప్పులు వహింత్రు
సంయమనము పాటించరు చాల మంది
తెలుగు బ్లాగుల బుధజన తీరు దెలియ .

అన్నియును తమకె తెలియునన్న యహమె ,
యతిశయమె మూలమింతకు _ స్వాతి శయము
వీడి , యితరులు చెప్పేది కూడ వినుటె
విఙ్ఞత కద ! , యిచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

20 కామెంట్‌లు:



  1. యిచ్చోట సర్వఙ్ఞు లెవరు ?

    ఒకటి సర్వజ్ఞుల గురించి మాట్లాడండి. లేదంటే ఇచ్చోటి‌ గురించి‌ మాట్లాడండి అంతే కాని ఇట్లా రెండింటికి లంకె పెట్టి ప్రశ్నిస్తే యెట్లాండి ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్వఙ్ఞ నామధేయము
      శర్వునకే గాని , బ్లాగు జన వినుతులనూ
      సర్వఙ్ఞు లనుట " మౌసల
      పర్వ " వినోద గత సుభగ వైభవమేగా .

      తొలగించండి
  2. మాస్టారుగారు, ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.

    VNR gaaru, I am impressed every time with your timing, wit and knowledge. Please open your blog and write for us.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విషయ మేదైనను విఙ్ఞాన ఖని తాను
      మూడు భాషలయందు బుధుడు గాన
      నాబోటి జగడాల ఆబోతులకు తాను
      ముకుతాడు వేయు , బోధకుడు గాన
      ఎదుటి వాళ్ళెవరైన చదురాడినా తాను
      మాట జారడు సంయమ మతి గాన
      పరిచయ మైనచో విరి పద్మమై తాను
      చెలిమి హస్తము చాచు , స్థిరుడు గాన

      నొనర యోగ్యత లెన్నియో యుండి కూడ
      నిండు కుండ వోలె తొణకని ఘనుడు , జన
      వినుతుడు , నరసింహారావు విన్నకోట
      వారు , ప్రస్తుతించ దగు మాష్టారు మనకు .

      తొలగించండి
    2. మాస్టారు గారు, చిన్న చిన్న పదాలతో పద్యాలు యేమిరాని నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేలా వ్రాయటం మీకే చెల్లింది. బహుచక్కగా ఉంది. మీరు చెప్పినది ఎంత మాత్రము సత్యదూరం కాదు.

      తొలగించండి
    3. సార్ ,
      అన్యగామిగారూ , విన్నకోట వారు లబ్ధ ప్రతిష్టులు , జగమె ఱిగినవారు . పై పద్యంలో మీరన్నట్టు వారి మూర్తిమత్త్వంలో
      నేను చెప్చిపింది చిన్నమెత్తు . వారితో నాకు బ్లాగు పరిచయమే కాదు , ముఖపరిచయమూ ఉంది . కడుంగడు
      స్నేహశీలి . కనీసం హైదరబాదులో ఉండే బ్లాగు మిత్రులనైనా
      కలుసుకుందామండీ అంటుండేవారు . వారి ప్రోద్బలంతోటే
      శ్యామలరవుగారి ఇంటికెళ్ళేము . ధన్యవాదాలు .

      తొలగించండి
    4. "అన్యగామి" గారూ, పైన రాజారావు మాస్టారి సరళమైన పద్యరచనాశైలి గురించి మీరన్నది నిజం. వారి పద్యాలు నాక్కూడా తేలికగా అర్థమవుతాయి.

      తొలగించండి
  3. అంత ప్రశంస పొందడానికి నేను తగను రాజారావు మాస్టారూ. నాదంతా శృతపాండిత్యము, మిడిమిడి జ్ఞానమ్మున్నూ. మీ మంచి మాటలకు ధన్యవాదాలు 🙏.

    రిప్లయితొలగించండి
  4. VNR సార్ ,
    అంతగా ప్రశంసించించింది ఏదీ లేదండి .స్పృసించిన
    ప్రతి అంశమూ తమ కన్వర్థమే . మా కందరకూ
    గౌరవాభిమాన పాత్రులు మీరు . మీతో పరిచయమూ ,
    స్నేహమూ మాకు అభిలషణీయము .

    రిప్లయితొలగించండి
  5. సరసులు , సాహిత్యసుధా
    కరులు , కవులు , కవి బుధజన గౌరవ వినుతుల్ ,
    వరణీయులె గాని , సగటు
    నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్ .

    రిప్లయితొలగించండి
  6. క్షమించాలి చాలా ఆలస్యంగానే చెబుతున్నాను.
    జన్మదిన శుభాకాంక్షలు

    అన్యగామి గారి ప్రపోజల్ నేను సపోర్ట్ చేస్తున్నాను. VNR గారు వెంటనే బ్లాగు మొదలుపెట్టాలి. ........ మహా

    రిప్లయితొలగించండి