సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, నవంబర్ 2019, శుక్రవారం

మోడరన్ సరస్వతీ కైమోడ్పు

క్షణములో ఙ్ఞానాబ్ధి గడియించు నగణిత
వాట్సాప్ శారదా వందనములు
పలు పోకడలు వోవు భాషా సుభాకార
వర  ఫేసుబుక్ వాణి వందనములు
సారస్వతస్సర్వ సంగ్రామ రంగమా
బ్లాగుల భారతీ  వందనములు
విఙ్ఞాన భాండమై విలసిల్లు భగవతీ
వరలు ఈ బుక్ రూప  వందనములు

వ్రాయ పెన్నులు కాగితాల్  వనరు లేల
అక్షరాల్ కూర్చి వ్రాయంగ ననవసరము
టచ్చి స్క్రీనున నొత్తిన వచ్చు విథము
వరలు చదువుల తల్లికి వందవములు .

4 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు రాజారావు మాస్టారు.
    ఒకప్పుడు పోకెట్ కేల్క్యులేటర్లు (pocket calculator) వచ్చాయి - వాటికి అలవాటు పడిన ప్రజలు క్రమేపీ కూడికలు, తీసివేతలు, భాగహారాల నోటిలెక్కలు చెయ్యడం మర్చిపోయారు. తరువాత ఇమెయిల్ వచ్చింది - జనాలకు ఉత్తరాలు వ్రాసే కళ (skill) తప్పిపోయింది. తరువాత సెల్ ఫోన్ లో మెస్సేజులు పంపించే సౌలభ్యం ఉండడంతో ఒక పూర్తి వాక్యం వ్రాయడం వదిలేశారు, ఇంగ్లీష్ స్పెల్లింగులు భ్రష్టు పట్టి పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది నానా రకాల విజ్ఞానాన్ని వెదజల్లుతూ - ప్రజలు ఆ మైకంలో పడిపోయి పరిసరాలు కూడా పట్టించుకోవడం లేదు, ప్రమాదాల బారిన పడుతున్నారు.

    హు, ప్రగతి :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు శ్రీ నరసింహరావు గారికి వందనములు .
      ఇంకా అక్షరాలు రాయడ మెక్కడుందండీ .
      వత్తడమే కదా . వొకటి దబాయియ్యే అంటూ
      ఫోను కంపెనీలు దబాయిస్తున్నవి .
      ధన్యవాదాలు .

      తొలగించండి
  2. > ప్రజలు ఆ మైకంలో పడిపోయి పరిసరాలు కూడా పట్టించుకోవడం లేదు
    అప్పుడే జనం ఒళ్ళుమరిచిపోయేంత మైకంలో పడిపోతే ఎలాగండీ. ముందుముందు ఇంకా ఇంకా ఎన్నెన్నో technological developments రానున్నాయి. అప్పటికోసం జనం దగ్గర పోగొట్టుకోవటానికి కొంచెంగా ఏమన్నా మిగులు సరుకు అన్నది ఉండాలండీ బాబూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙂🙂.
      ఆ developments వలన వచ్చిన మత్తు productsలో మునిగి తేలడానికి జనాలకు ఎక్కడ లేని సత్తువ వస్తుంది శ్యామలరావు గారూ. మైకం కదా 🙂.

      తొలగించండి